బ్రేకింగ్ : ఎనిమిది మందికే ఛాన్స్…?

ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. మంత్రివర్గ విస్తరణకు ఏర్పాటు చేయాలని జీఏడీ, ప్రొటోకాల్ శాఖ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్ లో మొత్తం 8 మందికి అవకాశముందని తెలుస్తోంది. ఎనిమిది మంది ప్రమాణస్వీకారానికి అనువుగా ఏర్పాట్లు చేయాలని సాధారణ పరిపాలన శాఖకు ఆదేశాలు జారీ చేయడంతో ఆ ఎనిమిది మంది ఎవరన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ సారి మంత్రి వర్గ విస్తరణలో శాఖల వారీగా కూడా భారీ మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత మరోసారి విస్తరణ ఉంటుందని చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*