ప్రశాంతంగా ముగిసిన పోలింగ్..!

electon reslut

తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్నచిన్న సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల్లో 4 గంటలకు ముగిసింది. మిగతా 106 నియోజకవర్గాల్లో 5 గంటలకు పోలింగ్ ముగిసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోటెత్తారు. హైదరాబాద్ లో మాత్రం చాలా ప్రాంతాల్లో ఓట్లు వేయడంలో ఓటర్లు నిర్లక్ష్యం వహించినట్లు కనిపిస్తోంది. గ్రామాల్లో ఉదయం నుంచి పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు బారులుతిరి కనిపించగా… హైదరాబాద్ లోని పోలింగ్ బూత్ లు మాత్రం ఖాళీగా కనిపించాయి. గ్రామాల్లో ఓటు హక్కువ వినియోగించుకునేందుకు నగరాల్లో ఉండే ప్రజలు పల్లెబాట పట్టారు. ఇప్పటివరకు అనధికారికంగా ఉన్న సమాచారం మేరకు 68 శాతం వరకు పోలింగ్ నమోదు అయినట్లు తెలుస్తోంది. మరికొంత సమయంలో ఈసీ అధికారికంగా సమాచారం ఇవ్వనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*