ప్రవాసులకు తెలుగు రచనా పోటీలు

తెలుగు భాషాభివృద్ధి కోసం అమెరికాలోని శాక్రమెంటో తెలుగు సంఘం విశేష కృషి చేస్తోంది. తెలుగు భాషాభివృద్ధే లక్ష్యంగా ఈ సంఘం ఆధ్వర్యంలో యూఏఎన్ మూర్తి మెమోరియల్ రచనల పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం కథలు, కవితల పోటీలను జరపనున్నట్లు ప్రకటించింది. అమెరికా, కెనడా, యూరోప్ తదితర విదేశాల్లో నివసిస్తున్న ఆసక్తి కలిగిన తెలుగువారు… కథలు, కవితలు రాసి telugusac@yahoo.com మెయిల్ ఐడీకి డిసెంబర్ 15వ తేదీ లోపు పంపించాల్సి ఉంటుంది. పోటీల్లో గెలిచిన వారికి ప్రథమ బహుమతిగా 116 డాలర్లు, ద్వితీయ బహుమతిగా 58 డాలర్లు, తృతీయ బహుమతిగా 28 డాలర్లు అందజేయనున్నారు. మరిన్ని వివరాలకు నాగ్: 859-536-5308, సత్యవీర్: 216-262-4905, వెంకట్: 408-887-0284 నెంబర్లను సంప్రదించవచ్చు.

1 Comment on ప్రవాసులకు తెలుగు రచనా పోటీలు

  1. ప్రవాస భారతీయులకు స్వాగతం. మీ రచనలను తెలుగులో telugusac@yahoo.com కు డిసెంబర్ 15 2018 లోగా పంపండి. పోటీకి సంబందించిన మరిన్ని వివరాలకు https://tinyurl.com/tagscontest ను దర్శించండి. ఇట్లు … శాక్రమెంటో తెలుగు సంఘం

Leave a Reply

Your email address will not be published.


*