బాల్క సుమన్ ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తత

చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ల లొల్లి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బుదవారం టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ప్రచారం చేసేందుకు నియోజకవర్గంలోని ఇందారంలో కి రాగా.. టిక్కెట్ దక్కని నల్లాల ఓదేలు వర్గం వారు అడ్డుకున్నారు. బాల్క సుమన్ కాన్వాయ్ ను అడ్డుకుని ఆందోళన చేశారు. ఇంతలో నల్లాల ఓదేలు వర్గానికి చెందిన రేగుంట గట్టయ్య అనే ఓ కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో సుమన్ వర్గానికి చెందిన ముగ్గురికి సైతం మంటలు అంటుకున్నాయి. ప్రస్తుతం వారికి ఆసుపత్రికి తరలించగా ఇందారంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, టిక్కెట్ కోసం నల్లాల ఓదేలు గత రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.