బ్రేకింగ్ : టీఆర్ఎస్ టిక్కెట్ చిచ్చు… ఒక‌రి మృతి

టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ల లొల్లిలో ఓ వ్య‌క్తి మ‌ర‌ణించాడు. మంచిర్యాలీ జిల్లా చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గానికి అభ్య‌ర్థిగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ బాల్క సుమ‌న్ ను ప్ర‌క‌టించారు. దీంతో ఆగ్ర‌హించిన తాజా మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదేలు వ‌ర్గానికి చెందిన రేగుంట గ‌ట్ట‌య్య ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. ఈ నెల 12వ తేదీన నియోజ‌క‌వ‌ర్గంలోని ఇందారం గ్రామానికి అభ్య‌ర్థి బాల్క సుమ‌న్ ప్ర‌చారానికి వ‌చ్చారు. దీంతో గ‌ట్ట‌య్య ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి ప్ర‌య‌త్నించాడు. అక్క‌డే ఉన్న మంగ‌ళ‌హార‌తిలోని నిప్పు అంటుకుని గ‌ట్ట‌య్య‌తో పాటు మ‌రో 16 మందికి గాయాల‌య్యాయి. 60 శాతం కాలిన గాయాల‌తో గ‌ట్ట‌య్య హైద‌రాబాద్ లో చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం మృతి చెందాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*