గ‌ల్లాపై మండిప‌డ్డ తెలంగాణ ఎంపీలు

లోక్‌స‌భ‌లో చ‌ర్చ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై టీఆర్ఎస్ ఎంపీలు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర విభ‌జ‌న అశాస్త్రీయం, ప్ర‌జాస్వామ్యానికి విరుద్ధంగా జ‌రిగింద‌ని గ‌ల్లా వ్యాఖ్య‌నించ‌డంతో టీఆర్ఎస్ ఎంపీలు ఆయ‌న ప్ర‌సంగాన్ని అడ్డ‌గించారు. స్పీక‌ర్ వారించ‌డంతో వారు శాంతించారు. తిరిగి ప్ర‌సంగం చివ‌ర్లో కూడా ఇలానే మాట్లాడ‌టంతో మ‌ళ్లీ అభ్యంత‌రం తెలిపారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న క‌చ్చితంగా అప్ర‌జాస్వామికంగా జ‌రిగింద‌ని, త‌లుపులు మూసేసి, సీసీ కెమెరాలు బంద్ చేసి జ‌రిపార‌ని గ‌ల్లా వ్యాఖ్యానించారు. గ‌ల్లా వ్యాఖ్య‌లపై స్పందించిన టీఆర్ఎస్ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి…రాష్ట్ర విభ‌జ‌న‌కు అన్ని ప‌క్షాలు అంగీక‌రించాయ‌ని, విభ‌జ‌న‌కు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ కూడా లేఖ ఇచ్చింద‌ని గుర్తుచేశారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*