టీఆర్ఎస్ ర్యాలీలో న‌కిలీ నోట్లు..

టీఆర్ఎస్ ప్ర‌గ‌తి నివేద‌న స‌భకు వెళ్ల‌డానికి తీసిన ర్యాలీలో కొంద‌రు చోటా నాయ‌కులు చిల్ల‌ర ప‌ని చేశారు. ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని రామంతాపూర్ నుంచి కార్పొరేట‌ర్ గంధం జ్యోత్స్నా నాగేశ్వ‌ర్ రావు ఆధ్వ‌ర్యంలో స‌భ‌కు వెళ్ల‌డానికి రామంతాపూర్ ప్ర‌ధాన ర‌హదారిపై ర్యాలీ నిర్వ‌హించారు. డ‌ప్పు చ‌ప్పుళ్ల‌తో నిర్వ‌హించిన ఈ ర్యాలీలో ఒక‌రిద్ద‌రు నేత‌లు అత్యుత్సాహంతో చేసిన ప‌ని ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ర్యాలీలో పాల్గొన్న నేత‌లు న‌కిలీ 500, 2000 నోట్ల‌ను వెద‌జ‌ల్లారు. దీంతో అక్క‌డున్న డ‌ప్పు క‌ళాకారులు, ఇత‌ర సాదార‌ణ ప్ర‌జ‌లు అవి నిజ‌మైన‌వే అనుకుని పాపం రోడ్డుపైనే వెతికి తీసుకున్నారు. తీరా అవి న‌కిలీ నోట్లు కావ‌డంతో వారు విసిరేసిన నేత‌ల‌ను తిట్టుకున్నారు. పార్టీ ఇంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుని ఎంతో శ్ర‌మ‌ప‌డి నిర్వ‌హిస్తున్న ఇంత‌టి భారీ స‌భ‌లో చోటా నేత‌లు చేస్తున్న ఇటువంటి ప‌నుల వ‌ల్ల సోష‌ల్ మీడియాలో ర‌చ్చ అవుతోంది.