సీసీ కెమెరాలు ఆపేస్తాం..టీవీల్లోనూ ప్రసారం చేయం

తిరుమలలో మహా సంప్రోక్షణ పై గురువారం మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. ఆగస్టు 9 నుండి 17 వరకు జరుగనున్న మహా సంప్రోక్షణ ను అన్ని ఛానెల్ లలో ప్రసారం చేయాలని పిటిషనర్ కోరారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆగమ శాస్త్ర రిపోర్ట్ ను  టీటీడీ కోర్టుకు సమర్పించింది. ఆగమ శాస్త్రం ప్రకారం మహా సంప్రోక్షణ ఎలాంటి టీవీ ఛానెల్స్ లో ప్రసారం చేయడానికి వీలు లేదని టిటిడి స్పష్టం చేసింది. మహా సంప్రోక్షణ జరుగుతున్న సమయంలో సీసీటీవీలను కూడా ఆపేస్తామని టీటీడీ కోర్టుకు తెలిపింది. గర్భ గుడిలో కాకుండా బయట కెమెరాలను ఎందుకు వద్దంటున్నారో తెలపాలని పిటీషనర్ కోరారు. దీంతో, కనీసం టీటీడీ ఛానల్ లో అయినా ప్రసారం చేయడానికి అభ్యంతరాలు ఏమిటని హైకోర్టు టీటీడీని ప్రశ్నించింది. అభ్యంతరాలను సోమవారంలోగా తెలపాలని టీటీడీని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*