వైసీపీలో చేరిపోయిన లీడర్

acp announced kadiri candidate

వైసీపీలోకి వసంత కృష్ణ ప్రసాద్ చేరిపోయారు. ఆయనకు పార్టీ కండువా కప్పి జగన్ సాదరంగా స్వాగతం పలికారు. ఆయన వెంట ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు కూడా ఉన్నారు. వేలాది మంది కార్యకర్తలు తరలిరాగా వసంతకృష్ణ ప్రసాద్ కృష్ణా జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర వద్దకు కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన వసంతకృష్ణ ప్రసాద్ వైసీపీలో చేరడంతో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేస్తానని వసంతకృష్ణ ప్రసాద్ ఈ సందర్భంగా మీడియాతో చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*