విరాట్ వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వివాదాస్ప‌ద‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో ముచ్చటించారు. ఇందులో ఓ వ్య‌క్తి విరాట్ ను ఎక్కువ చేసి చూపిస్తార‌ని, అత‌డిలో అంత ప్ర‌త్యేక‌త ఏమీ ఉంటద‌ని, అత‌నికంటే ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా ఆట‌గాళ్ల బ్యాటింగ్ బాగుంటుంద‌ని కామెంట్ చేశాడు. దీంతో విరాట్ కి చిర్రెత్తుకొచ్చింది. స‌ద‌రు వ్య‌క్తికి ధీటుగా బ‌దులిచ్చాడు.

విమర్శలూ… సమర్థింపులూ…..

నీవు న‌న్ను అభిమానించ‌కుంటే నాకొచ్చే న‌ష్ట‌మేమీ లేదు, కానీ ఇత‌ర దేశాల‌ను ప్రేమిస్తూ భార‌త్ లో ఉండ‌టం ఎందుకు… ఎక్క‌డికైనా వెళ్లి బ‌తుకు… నాకు ఇక్క‌డ ఉంటూ వేరే దేశాల‌ను పొగ‌డ‌టం ఇష్టం ఉండ‌దు అని వ్యాఖ్యానించాడు. ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. కొంద‌రు విరాట్ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌డుతున్నారు. ఇత‌ర దేశాల ఆట‌గాళ్ల‌ను ఇష్ట‌ప‌డ‌టం వ్య‌క్తిగ‌త అభిప్రాయ‌మ‌ని అంత‌దానికే దేశం వ‌దిలి ఎందుకు వెళ్లాల‌ని విరాట్ ను ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం విరాట్ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*