మళ్లీ ఓటుకు నోటు కేసు….?

ఓటుకు నోటు కేసు విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేస్తున్నారు. ఆయన ప్రగతి భవన్ లో కొద్దిసేపటి క్రితం ఈ కేసు పురోగతిపై పోలీసు అధికారులతో సమీక్షిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ నివేదికపై కూడా కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం కూడా ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇన్నాళ్లూ ఈ కేసు విషయంలో మౌనంగా ఉన్న కేసీఆర్ హటాత్తుగా సమీక్ష జరపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నిన్న గవర్నర్ నరసింహన్ తో కూడా ఈ విషయంపై చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద కేసీఆర్ మళ్లీ ఓటుకు నోటు కేసును ఎన్నికల వేళ బయటకు తెస్తున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*