Sat Apr 20 2024 13:40:19 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్...వరంగల్ లో భారీ అగ్నిప్రమాదం
వరంగల్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని కాశిబుగ్గ లోని కోటిలింగాల దేవాలయం పక్కన ఉన్న భద్రకాళీ ఫైర్ వర్క్స్ గోదాంలో ఈ ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం ఈ ఘటన జరగింది. ఈ ఘటన జరిగిన సమయంలో బాణాసంచా గోదాంలో ఉన్న ఆరుగురు వ్యక్తులు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ఒకరిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన గోదాం జనావాసాల మధ్య ఉండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
Next Story