భర్తను చంపి అది…. చేద్దామని..!

భార్యాభర్తల మధ్య సంబంధాలు మంటగలుస్తున్నాయి. డబ్బుల కోసం కట్టుకున్న భర్తను హత్య చేసి ఆక్సిడెంట్ గా చిత్రికంచింది ఓ భార్య. ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త చనిపోతే ఉద్యోగంతో పాటు పెద్ద మొత్తంలో ఇన్సూరెన్సు డబ్బులు కూడా వస్తాయని అత్యాశతో ఈ దారుణానికి ఒడిగట్టింది. వివరాల్లోకెళ్తే… మిర్యాలగూడకు చెందిన కేస్యా నాయక్, పద్మ దంపతులు హైదరాబాద్ లో స్థిరపడ్డారు. కేస్యా నాయక్ ది ప్రభుత్వ ఉద్యోగం.

రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి…

కాగా, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడలో కరెంటు స్తంభానికి కారు ఢీకొని తన భర్త కేస్యా నాయక్ మృతి చెందాడని పద్మ రెండురోజుల క్రితం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే, కేస్యా నాయక్ వంటిపై రోడ్డు ప్రమాదం జరిగిన ఆనవాళ్లు లేకపోవడం, పద్మ వైఖరిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు విచారణ ప్రారంభించడంతో అసలు విషయం బయటపడింది. ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇన్సురెన్సు డబ్బులు వస్తాయనే కుట్రతోనే వినోద్ అనే డ్రైవర్ తో కలిసి కేస్యా నాయక్ ను కారులోనే ఊపిరి ఆడకుండా చేసి హతమార్చారు. తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. ప్రస్తుతం పద్మతో పాటు వినోద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*