కామాంధుడికి శిక్ష పడాలని…

ఓ కామాంధుడి వేదింపులకు బయపడి.. తాను చనిపోయినా కామంధుడికి మాత్రం శిక్ష పడాలని సుసైడ్ నోట్ రాసి పోలీస్టేషన్ ముందే అత్మహత్యకు పాల్పడింది ఓ వివాహిత. సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ ముందు పేట్రోల్ పోసుకోని నిప్పంటించుకుంది. వెంటనే స్పందించిన పోలీసులు హుటహటిన మంటలు ఆర్పి ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. బోయిన్ పల్లి అన్నానగర్ కు చేందిన సబిత, దినేష్ లు భర్యాభర్తలు. మధ్యలో పరిచయం ఏర్పరుచుకున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సబితను లోబరుచుకొని భార్యాభర్తలు మధ్య చిచ్చు పెట్టాడు. విషయం తెలుసుకున్న భర్త దినేష్ భార్య నుంచి దూరంగా ఉంటున్నాడు. ఇద్దరు పిల్లలతో కలిసి సబిత తాడ్ బండ్ లోని పుట్టింటి వద్ద ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో తిరిగి వెంకటేశ్వర్లు తను చెప్పినట్లు వినాలని, లేకపోతే తన దగ్గర ఉన్న ఫోటోలు, వీడియోలను బహిర్గతం చేస్తానంటూ బ్లాక్ మెయిలింగ్ కు దిగాడు. దీంతో ఏం చేయాలో అర్థంకాక ఆత్మహత్యకు పాల్పడాలనుకుంది. అతను తన జీవితం నాశనం చేశాడని, తాను మరణించినా అతనికి మాత్రం శిక్ష పడలంటూ సుసైడ్ నోట్ రాసి.. పోలీస్ స్టేషన్ లోకి సుసైడ్ నోట్ కాలిపోకుండా విసిరి అత్మహత్యయత్నానికి పాల్పడింది. ప్రస్థుతం సబిత పరిస్థితి విషమంగా ఉండగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*