జగన్ కేసులో కీలకంగా “సిట్” రిపోర్ట్….!!

ysjaganmohanreddy ichapuram

విశాఖ ఎయిర్ పోర్టులోతనపై జరిగిన దాడి పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అజమాయిషీ లేని థర్డ్ పార్టీ సంస్థల చేత విచారణ జరిపించాలని కోరుతూ వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు…ఇదే కేసులో వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి,బుర్ర గడ్డ అనిల్ ధాఖలు చేసిన పిటిషన్ లు కూడా వీటితో కంబైన్డ్ చేసి విచారణ చేపట్టిన ధర్మాసనం..ఈ కేసులో ఇప్పటి వరకు సిట్ అధికారులు దర్యాప్తు జరిపిన సిట్ నివేదికను సీల్డ్ కవర్ లో వచ్చే మంగళవారం కోర్టుకు సమర్పించాలని ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించింది.. ఇక జగన్ వేసిన పిటిటషన్ పై విచారణ అర్హత రేపు వాదనలు వింటామని విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.

మూడు పిటీషన్లనూ….

అంధ్రప్రదేశ్ ప్రతిప‌క్ష నేత వైసీసీ అధినేత వైఎస్ జ‌గ‌న్ హ‌త్యాయ‌త్నం వ్యవహారం దుమారం రేపుతోంది. మ‌రో వైపు దాడిపై ఎన్నో అనుమానాలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో మూడు పిటిషన్లు ధాఖలయ్యాయి…ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీరుపై తమకు నమ్మకంలేదని ఈ సంఘటనపై థర్డ్ పార్టీ చేత,లేదా సిబిఐ చేత విచారణ జరిపించేలా కోర్టు ఆదేశాలు జారీ చేయ్యాలని పిటిషనర్ తరుపు న్యాయవాదులు కోర్టును కోరారు. మూడు పిటిషన్లను కంబైన్డ్ చేసి విచారించిన హైకోర్టు ఇప్పటి జగన్ పై జరిగిన దాడికి సంబంధించిన సిట్ రిపోర్టును సీల్డ్ కవర్ లో వచ్చే మంగళవారం వరకు కోర్టుకు సమర్పించాలని ఏపి ప్రభుత్వాన్ని ఆదేశింది..జగన్ వేసిన పిటిషన్ విచారణ అర్హత పై రేపు మరొక సారి వాదనలు వింటామని వాయిదా వేసింది.

ఏపీ పోలీసులపై అనుమానం…..

సంఘటన జరిగిన కొద్ది సేపటికే ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ మాట్లాడిన తీరుపై అనేక అనుమానాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు…పిటిషనర్ తరుపు న్యాయవాదులు. ఈ కేసును రాజ్యాంగ బద్దంగా చూడకుండా రాజకీయ కోణంలో చుస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఆంద్రప్రదేశ్ పోలీసులు ఈ కేసులపై ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నామని కోర్టుకు తెలిపారు. ఏపీ ప్రభుత్వం అడ్వకేట్ జనరల్..బాధితుడు జగన్ పోలీసుల దర్యాప్తులకు సహకరించలేదని,160 సీఆర్పీ కింద నోటీసులు ఇచ్చినా ఎలాంటి సమాధానం చేప్పలేదని కోర్టుకు తెలిపారు.

స్టేట్ మెంట్ ఎందుకివ్వలేదంటే…..?

ఏపి పోలీసులపై నమ్మకం లేకనే జగన్ పోలీసులకు స్టేట్ మెంట్ ఇవ్వలేదని అందుకే థర్డ్ పార్టీ చేత విచారణ జరిపించాలని కోరుతున్నామని పిటిషనర్ తనుపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.ఆంద్రప్రదేశ్ ప్రతి పక్ష నేత జగన్ పై జరిగిన దాడిని ఏపి ప్రభుత్వం రాజకీయం చేస్తుందన్నారు…ఈ సంఘటన పై ఏపి పోలీసుల తీరుపై అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టే సిబిఐ విచారణ కుే ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు కోరామన్నారు పిటిషనర్ తరుపు న్యాయవాదులు. ఇప్పటి వరకు ఏపీ పోలీసులు జరిపిన విచారణ నివేదికను కోర్టు కు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింవదన్నారు..ఇక మూడు పిటిషన్ లపై రేపు మరోక సారి ఉమ్మడి ధర్మాసనం విచారణ చేపడుతుందన్నారు. సంచలనంగా మారిన జగన్ దాడి కేసుకు సంభంధించిన వ్యవహారంలో సిట్ రిపోర్టు కీలకంగా మారనుంది..ఇప్పటికే అధికార టీడిపి ప్రతిపక్ష వైసిపి నేతల మధ్య మాటల యుద్దం జరుగుతున్న నేపధ్యంలో రేపటి విచారణ లో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*