చంద్రబాబుపై జగన్ ఛలోక్తులు…

ప్రజాసంకల్స యాత్ర 181వ రోజు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకర్గంలో మంగళవారం జరిగింది. తణుకు పట్టణంలో జరిగిన బహిరంగ సభ లో జగన్ మాట్లాడుతూ… ఎన్నికల్లో అధికారంలోకి వస్తే అగ్రీగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. తణుకు ప్రాంతంలో తాగునీటి సమస్యను తీరుస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా పేరు చెప్పి ఢిల్లీకి వెళ్లి తెల్లవారు జామున మూడు గంటలకు అగ్రీ గోల్ ఆస్తులు కొనేందుకు ముందుకువచ్చిన వారిని కలవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.

చేతికి ఉంగరం, మెడలో గొలుసు, జేబులో పర్సు ఉండదని తరచూ చెబుతున్నాడని, అలాంటి వ్యక్తికి హైదరాబాద్ లో ఇంద్రభవనం, నాలుగు లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తరచూ సెల్ ఫోన్, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ గురించి మాట్లాడుతూ, సత్య నాదేళ్లను తానే తయారుచేశానని చెప్పే చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేశ్ ను మాత్రం సాఫ్ట్ వేర్ లేదా హార్డ్ వేర్ గా ఎందుకు తయారుచేయలేదని, ఎందుకు పప్పు అనే బిరుదు వచ్చిందని ఎద్దేవా చేశారు. తనకు మధ్యం అలవాటు లేదంటాడని, కానీ, అందరినీ సాయంత్రం ఒక పెగ్గు తాగాలని సలహాలు ఇస్తున్నాడని, పిల్లలను చెడగొడుతున్నాడని విమర్శించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*