బ్రేకింగ్ : పోలీసులకు వై.ఎస్.షర్మిళ ఫిర్యాదు

sharmila sensational allegations

తనపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సోదరి వై.ఎస్.షర్మిళ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తన పట్ల, తన కుటుంబం పట్ల సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని, వారి పై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఆమెతో పాటు ఆమె భర్త అనీల్ కుమార్, పార్టీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ కూడా పోలీస్ కమిషనర్ ను కలిశారు. షర్మిళ వ్యక్తిగత జీవితంపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో గత కొన్ని రోజులు కొందరు తీవ్రమైన వ్యాఖ్యలు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*