షర్మిలపై ఈ అసత్య ప్రచారమేంటి?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ పై వైఎస్సార్ కాంగ్రెస్ మండిపడింది. వైఎస్ పై పవన్ విమర్శలు సరికాదని ఆ పార్టీ నేత ఆళ్లనాని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇప్పటికీ కోట్లాది మంది గుండెల్లో కొలువై ఉన్నారన్నారు. సోషల్ మీడియాలో జనసైనికులు షర్మిల మీద తప్పుడు వ్యాఖ్యలు చేయడంపై ఆయన ఫైరయ్యారు. ఒక మహిళగా మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిలపై అసభ్య పదజాలం ఉపయోగిస్తూ, అసత్య ప్రచారం చేస్తున్న సంగతి పవన్ కు తెలియదా? అని నాని ప్రశ్నించారు.

కంట్రోలో చేయండి……

అసత్య ప్రచారం చేస్తున్న జనసైనికులను కంట్రోలు చేయకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. వైఎస్ కుటుంబం సోషల్ మీడియాతో వస్తున్న వ్యాఖ్యలపై మనోవేదనకు గురవుతుందన్నారు. మీరు మాట్లాడితే ప్రవచనాలు…మేం మాట్లాడితే వ్యక్తిగతమా? అని పవన్ ను ప్రశ్నించారు. ప్రతి సారి ఫ్యాక్షనిజం గురించి మాట్లాడే పవన్ కు అస్సలు అదంటే ఏంటో తెలుసా అని నిలదీశారు. చంద్రబాబు తన సొంత జిల్లాలోనే ఫ్యాక్షన్ రాజకీయాలు నడుపుతున్నారన్నారు. మీ చిత్తశుద్ధి ఏంటో పోలవరం ప్రాజెక్టుకు వచ్చినప్పుడే ప్రజలు గుర్తించారన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*