వైసీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జగన్ చేస్తున్న పాదయాత్ర వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పలువురు నేతలు చేరుతున్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత రంగనాథ రాజు టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన ఈ నెల 27న భీమవరంలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. 2004లో ఆయన అత్తిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు.