కేసు ఎన్ఐఏకి ఇస్తే చంద్రబాబుకు భయమెందుకు..?

botsa comments on chandrababu naidu

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసును ఎన్ఐఏ విచారిస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని వైసీపీ నేత బొత్స సత్యానారాయణ ప్రశ్నించారు. శనివారం ఆయన మాట్లాడుతూ… ఎన్ఐఏకి రాసిన లేఖను చూస్తుంటే చంద్రబాబుకి భయం పట్టుకున్నట్లు స్పష్టంగా తెలుస్తొందన్నారు. ఎన్ఐఏ విచారణ చేయాలని న్యాయస్థానం కూడా తీర్పు చెప్పిందని, పార్టీ అధినేతపై దాడి జరిగినా కేంద్రం జోక్యం చేసుకోవద్దనడటం ఏంటని ప్రశ్నించారు. హత్యా రాజకీయాలపై ఆధారపడి చంద్రబాబు బతుకుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కూడా ఏదో ఓ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న ఉబలాటంతో ఉన్నారని పేర్కొన్నారు. అసలు టీడీపీతో పవన్ కి సంబంధాలు ఉన్నాయో లేవో ముందు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*