మరి వారిది కట్టప్ప కత్తి పార్టీనా..?

kodali nani vs tdp in gudivada

వైసీపీని కోడికత్తి పార్టీ అని అంటున్నతెలుగుదేశం నేతలది వెన్నుపోటు పొడిచిన కట్టప్ప కత్తి పార్టీనా అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబ తమ పార్టీ నుంచి కొనుక్కున్న గొర్రెలతో జగన్ ను విమర్శిస్తూ లేఖ రాయించారని ఆరోపించారు. 2004కి ముందు కూడా ఇటువంటి రాతలే యెల్లో మీడియాతో వైఎస్ఆర్ పై రాయించారని గుర్తు చేశారు. అయితేనా వైఎస్ అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు జగన్ కూడా అధికారం చేపడతారని ధీమా వ్యక్తం చేశారు.

ఇంకా 125 రోజులే…

చంద్రబాబుకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని, ఇంకా 125 రోజులే ఆయనకు సమయం ఉందన్నారు. ఐదుసార్లు ఓడిపోయిన దొడ్డిదారిని ఎమ్మెల్సీ అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా జగన్ ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబులో భయం పెరిగిపోయిందని, ఎవరి కాళ్లైనా పట్టుకుని మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రొడెక్కి తిడుతున్న పవన్ కళ్యాణ్ ను కూడా కలిసి రావాలని చంద్రబాబు కోరుతున్నారంటేనే ఆయన పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*