అరవింద సమేత మొదటి సాంగ్ రివ్యూ!

త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. దసరా కానుకగా రిలీజ్ అవుతున్న ఈచిత్రం యొక్క ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్. నిన్ననే ఈసినిమాలో మొదటి లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. పాట స్టార్టింగ్ లో పూజా హెగ్డే జూనియర్ ను ఉద్దేశించి “టఫ్ గా కనిపిస్తారు కానీ మాట వింటారు పర్లేదు” అనడం..దానికి ఎన్టీఆర్ సిగ్గు పడుతూ పక్కకి చూడడంతో సాంగ్ స్టార్ట్ అయింది.

గమ్మత్తైన పదాలతో…….

అక్కడ నుండి సిరివెన్నెల గమ్మత్తైన పదాలతో పాట సాగుతుంది. “పులిపై పడిన లేడీ కథ వింటారా” అంటూ తారక్ మీద అరవింద పేరున్న పూజా ప్రేమా దాడి ఎలా చేసిందో వర్ణించిన తీరు బాగుంది. తమన్ కొట్టిన ట్యూన్ అంత గొప్పగా లేకపోయినా పర్లేదు వినొచ్చు అనిపించేలా ఉంది. అంచనాలు మధ్య రిలీజ్ అవుతున్న ఈసినిమా సాంగ్స్ తో సందడి మొదలుపెట్టేశారు యూనిట్. మొదటి సాంగ్ కాబట్టి అందరి అంచనాలకు తగ్గట్టు లేదేమో కానీ మెలిగిన పాటలు బాగానే ఉంటాయి అని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఫ్యాన్స్. మరి ఫ్యాన్స్ భావిస్తున్నట్టు మిగిలిన సాంగ్స్ బాగుంటాయేమో చూడాలి.

డ్రీం ప్రాజెక్టు అంటున్న……..

కానీ తమన్ చెప్పడం ఏంటంటే ఇది నా డ్రీం ప్రాజెక్ట్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ తో కలిసి పనిచేయడం నాకు కళ అని చెప్పిన తీరు చూస్తుంటే సూపర్ హిట్ ఆల్బం ఇస్తాడేమో అని అనిపిస్తుంది. ఇక ఈనెల 20న సాంగ్స్ అన్నీ రిలీజ్ అవుతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. టీజర్ లో తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సాంగ్స్ ఎంత క్రేజ్ వస్తుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*