క్యాస్టింగ్ కౌచ్ కాస్తా…?

తెలుగు వెండితెర వివాదం క్యాస్టింగ్ కౌచ్ నుంచి రాజకీయాలవైపు మళ్ళింది. శ్రీ రెడ్డి మొదలు పెట్టిన తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలపై అరాచకం వివాదం ఇక ముగిసింది అనే అంతా భావించారు. అది కాస్తా అటు తిరిగి ఇటు తిరిగి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు తిరిగింది. దీనికి కారణం పవన్ శ్రీ రెడ్డి పై చేసిన కామెంట్స్ ఒక ఎత్తయితే పికె వ్యాఖ్యలపై శ్రీ రెడ్డి స్పందన ఆ తరువాత రెచ్చిపోయిన పవన్ ఫ్యాన్స్ నడుమ వివాదం హాట్ హాట్ గా సాగుతుంది.

పవన్ పై మీడియా కుట్ర అంటున్న అభిమానులు …

తెలుగు చిత్ర పరిశ్రమలో ఏమి జరిగినా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలంటూ సాగుతున్న ప్రచారం ఒక కుట్ర గా ప్రచారం చేస్తున్నారు పికె అభిమానులు. అధికారంలో ఉన్న తెలుగుదేశం, ప్రతిపక్షం జగన్ లను ప్రశ్నించని శ్రీ రెడ్డి పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆయన తల్లిపై సైతం దారుణంగా కామెంట్ చేయడాన్ని పవన్ అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ నేతను పార్టీని టార్గెట్ చేసే కుట్ర నడుస్తుందని వారు అనుమానిస్తున్నారు. ఈ మేరకు శ్రీ రెడ్డి కి వ్యతిరేకంగా సోషల్ మీడియా లో పవన్ అభిమానులు పెద్దఎత్తున విమర్శలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. పవన్ పై జరుగుతున్న కుట్రలో ప్రధాన మీడియా కూడా పాత్ర ఉందని వారు చెబుతున్నారు.

అంతా రేటింగ్స్ కోసమే …

రాష్ట్రం లో హోదా అంశం ఎంపీల ఆందోళన ప్రజా ఉద్యమాలు, దేశంలో అసిఫా సంఘటనపై అరకొర వార్తలు ఇస్తున్న ప్రధాన తెలుగు మీడియా ఛానెల్స్ అప్రస్తుత అంశాలను రేటింగ్స్ కోసం వాడుతున్నాయని జనసేన అభిమానులు సైతం ఆగ్రహంతో ఊగిపోతూ చెబుతున్న్నారు. ఏదో ఒక అంశాన్ని వివాదం చేయడం, సమస్యలను పక్కన పెట్టేయడం రేటింగ్స్ రేటింగ్స్ అనే పరుగు పందెంలో ఎక్కడ వెనుకబడిపోతామని ఛానెల్స్ పోటీ పడి అభ్యంతర బూతు పురాణాలు మొదలెట్టేశాయని ఆరోపిస్తున్నారు పవన్ అభిమానులు. ఈ ధోరణి సరికాదని. వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆందోళన చేసిన రోజు నుంచి …

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాశ్మీర్, యుపిలో మహిళలపై జరుగుతున్న ఘోరాలపై నిరసన కార్యక్రమం చేపట్టారు. అదే రోజు శ్రీరెడ్డి ఒక ఛానెల్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ క్యాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయం చెప్పారు. పోలీస్ స్టేషన్, న్యాయస్థానాలు ఉండాగా వాటిని వదిలేసి ఈ హంగామా దేనికన్నారు. అక్కడ కూడా అన్యాయం జరిగితే రోడ్డెక్కాలని, మీడియా ను ఆశ్రయించాలన్నారు. ఆ వ్యాఖ్యలపై శ్రీ రెడ్డి భగ్గుమంది. పవన్ ను సాయం అడిగితే ఆయన స్పందించే తీరు ఇదా అంటూ విమర్శలు మొదలు పెట్టింది. పవన్ బహుభార్యత్వం నుంచి ఆయన తల్లి వరకు వెళ్లింది శ్రీరెడ్డి ఇప్పుడు దీనిపై రచ్చ రంబోలా మళ్ళీ మొదలైపోయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*