హైదరాబాద్ లో దారుణం…..!

transgender chandramukhi missing

ప్రేమించ లేదంటూ ఓ యువతి ఇంటికి వెళ్లి మరీ పెట్రోల్ తో తనతో పాటు ఆమెకు కూడా నిప్పంటించాడు ఇబ్రహీం అనే కీచకుడు. ఈ దాడిలో అజీనా బేగం మహిళ తో పాటు ఆమె వదిన కూడా తీవ్ర గాయాలు పాలయ్యారు.90శాతం గాయాలతో చావు బ్రతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు ఆ మహిళలు.బెహేరేన్ కు చెందిన ఇబ్రహీం గత కొన్నేళ్ళ గా గల్ఫ్ కంట్రీ లో ఉద్యోగం చేస్తున్నాడు ..అయితే అతనికి పెళ్లయిఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆరు నెలల క్రితం టపచాపుత్ర కి చెందిన అజీనా బేగం అనే ఓ యువతితో ఫేస్ బుక్ లో పరిచయం అయింది. అయితే కొద్ది రోజుల క్రితం ఇండియాకు వచ్చిన ఇబ్రహీం ఆమెను కలవడానికి ప్రయత్నించాడు కానీ ఆ యువతి నిరాకరించింది.

యువతి పట్టించుకోక పోవడంతో….

అంతే కాదు ఆ యువతి నీకు పెళ్లయింది నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు….అంటూ అతన్ని పట్టించుకోలేదు…దీంతో రాక్షసుడు లా మారిన ఇబ్రహీం ఈ రోజు ఉదయం పెట్రోల్ క్యాన్ తో ఆ యువతి ఇంటికి వెళ్లి ఆమెపై పోశాడు…ఇతను కూడా అంటించుకున్నాడు. దీంతో పాటు పక్క ఉన్న వాళ్ల వదిన కి కూడా మంటలు అంటుకుని తీవ్ర గాయాలు పాలయ్యారు…ఈ ఘటన లో ఇద్దరు మహిళలకు 90 శాతం గాయాలయ్యాయి.. ప్రస్తుతం ఉస్మానియా లో చికిత్స పొందుతున్నారు….ఘటనలో ఇబ్రహీం కి కూడా 40శాతం గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఒక్క సరిగా ఉలిక్కి పడ్డారు ఆ కాలనీ వాసులు…గ్యాస్ సిలిండర్ పేలిందని అనుకున్నారు …ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాళ్ళని ఆస్పత్రికి తరించారు …పెట్రోల్ కావడం తో ఇల్లు కూడా పూర్తిగా దగ్దం అయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*