బ్రేకింగ్ : ఆ ఇద్దరికి నో టిక్కెట్

105 మంది అభ్యర్థులను ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మంచిర్యాల చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు , సంగారెడ్డి జిల్లా ఆంధోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ కు టిక్కెట్లు నిరాకరించారు. మల్కజ్ గిరి, పెద్దపల్లి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల సీట్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మీడియా సమాావేశంలో కేసీఆర్ సంచలనంగా అభ్యర్థులను ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీనిరద్దు చేసిన తర్వాత తొలిసారి మీడియా సమావేశం పెట్టిన కేసీఆర్ అభ్యర్థులను గంటలోనే ప్రకటించడం విశేషం.15 సర్వేల ఆధారంగా టిక్కెట్ల కేటాయింపు చేసినట్లు తెలిపారు. తాను చెప్పినట్లు సిట్టింగ్ లందరికీ టిక్కెట్లు ఇస్తున్నామని, అయితే కొన్ని చోట్ల సామాజిక వర్గ సమీకరణాలు, సర్వేల ఫలితాల ఆధారంగా టిక్కెట్లు కేటాయించినట్లు తెలిపారు.