తక్కువగా నీళ్లు తాగితే ఇంత ప్రమాదమా?

వేసవికాలం అయినా శీతాకాలం అయినా.. నీరు మన శరీరానికి చాలా అవసరం. ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే నీటిని తగినంత తీసుకోవాలి
నీరు శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. నీటిని తక్కువగా తీసుకోవడం వల్ల మీ శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడమే కాకుండా కిడ్నీలో రాళ్ల సమస్య కూడా రావచ్చు
ఈరోజుల్లో కిడ్నీలో రాళ్ల సమస్య వేగంగా పెరిగిపోయి చాలా మంది బాధితులుగా మారుతున్నారు. తక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది
కిడ్నీ మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ఇది రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. సోడియం, కాల్షియం ఇతర ఖనిజాల సూక్ష్మ కణాలను మూత్ర నాళం ద్వారా శరీరం నుండి బయటకు పంపిస్తుంది
కానీ ఈ ఖనిజాలు మన శరీరంలో అధికంగా ఉన్నప్పుడు.. మూత్రపిండాలు వాటిని ఫిల్టర్ చేయలేక, వాటిలో పేరుకుపోయి రాళ్ల రూపంలోకి మారతాయి
వేసవి కాలంలో మన శరీరం ఎక్కువగా చెమటలు పట్టడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ఈ డీహైడ్రేషన్‌ కారణంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ
ఈ సీజన్‌లో తక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో ఉండే ఉప్పు, మినరల్స్ స్ఫటికాలుగా మారి రాళ్ల రూపాన్ని సంతరించుకుంటాయి
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు లేదా కుటుంబ చరిత్రలో మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు రోజుకు కనీసం 2 లీటర్ల నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగాలి
పొలంలో పని చేసినా, ఇతర పనుల కారణంగా చెమటలు చిందించినా ఇంకా ఎక్కువ నీటిని తాగాలి. అంతేకాకుండా ఉప్పు తీసుకోవడం కూడా తగ్గించాలి
చికెన్, మాంసం తక్కువగా తినండి. ఎక్కువ నీరు త్రాగడం ద్వారా మూత్రపిండాలు ఈ ఖనిజాలను ఫిల్టర్ చేస్తాయి. దీని కారణంగా రాళ్ళు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి