అనుకోని రికార్డును అందుకున్న విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ అంటేనే రికార్డులు.. అతడి పేరు మీద అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులున్నాయి
ఐపీఎల్‌లోనూ ఎన్నో గొప్ప రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌పై మాత్రం కోహ్లీ, అతడి అభిమానులు కోరుకోని రికార్డును సొంతం చేసుకున్నాడు
ఐపీఎల్‌లో సెంచరీ పూర్తి చేయడానికి ఎక్కువ బంతులు ఆడిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు
రాజస్థాన్‌పై కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 72 బంతుల్లో 113 చేశాడు. సెంచరీ పూర్తి చేయడానికి 67 బంతులు ఆడడంతో ఈ అవాంఛిత రికార్డు విరాట్ కోహ్లీ ఖాతాలో పడింది
మనీశ్ పాండేతో కలిసి సంయుక్తంగా ఈ రికార్డును కోహ్లీ పంచుకున్నాడు. 2009లో డెక్కన్ ఛార్జర్స్‌పై ఆర్సీబీ తరపున మనీశ్ పాండే 67 బంతుల్లో శతకాన్ని బాదాడు
విరాట్ ఐపీఎల్‌లో రికార్డు స్థాయిలో ఎనిమిదవ శతకాన్ని అందుకున్నాడు. ఐపీఎల్‌ కెరియర్‌లో 7,500 పరుగుల మైలురాయిని అందుకున్నాడు
66 బంతుల్లో 2011లో సచిన్ టెండూల్కర్ .. KTK మీద బాదాడు
66 బంతుల్లో 2010లో డేవిడ్ వార్నర్ (DC) సెంచరీ కొట్టాడు.. KKR మీద వార్నర్ సెంచరీ కొట్టాడు
66 బంతుల్లో జోస్ బట్లర్ (RR) సెంచరీ కొట్టాడు MI మీద 2022లో సెంచరీ బాదాడు