ఫ్రీగా మూడు నెలల పాటూ యూట్యూబ్ ప్రీమియం.. ఎలాగంటే?

యూట్యూబ్‌ వీడియో కంటెంట్‌ మధ్యలో యాడ్స్‌ను ప్లే చేస్తుంది. వీడియోలను ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో ఈ యాడ్స్‌ ఇబ్బందిపెడుతుంటాయి
యాడ్స్‌ లేని కంటెంట్‌ చూడాలంటే కచ్చితంగా యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రైబ్‌ చేయాల్సి ఉంటుంది
యూట్యూబ్ ప్రీమియం విషయంలో 3 నెలల ఉచిత సభ్యత్వాన్ని ఇస్తూ ఉన్నారు. సాధారణంగా వినియోగదారులు 1-నెల ఉచిత ఆఫర్‌ను పొందుతూ ఉంటారు. అయితే కొందరు 3 నెలల ప్రీమియం సభ్యత్వాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు
మూడు నెలల ఉచిత YouTube ప్రీమియం సభ్యత్వాన్ని క్లెయిమ్ చేయడానికి.. వినియోగదారులు కొన్ని స్టెప్స్ అనుసరించాలి
గతంలో YouTube ప్రీమియం సభ్యత్వం తీసుకోని వారు YouTube యాప్‌ని తెరిచిన తర్వాత.. ప్రొఫైల్ చిహ్నాన్ని నొక్కి "Get YouTube Premium," ఎంచుకోవాలి
అక్కడ వినియోగదారులు ఉచిత మూడు నెలల ఆఫర్‌ను ఎంచుకోవచ్చు. మూడు నెలల ఉచిత నెలవారీ సభ్యత్వాన్ని ఎంచుకున్న తర్వాత, వినియోగదారులు తమ బ్యాంక్ కార్డ్ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది
కొందరికి కేవలం 1-నెల ఆఫర్ కనిపించవచ్చు, మరికొందరికి 3 నెలల ఆఫర్ లభిస్తుంది. గూగుల్ ఏ ప్రాతిపదికన ఉచిత ఆఫర్‌ను నిర్ణయిస్తుందో తెలియదు
దీన్ని అనుసరించి వినియోగదారులు ఎటువంటి ఛార్జీలు లేకుండా మూడు నెలల పాటు YouTube Premiumని ఆస్వాదించవచ్చు
ఆ తర్వాత నెలవారీ రుసుము రూ.129 వర్తిస్తుంది. ఛార్జీలను నివారించడానికి, వినియోగదారులు ట్రయల్ వ్యవధి ముగియడానికి కొన్ని రోజుల ముందు సభ్యత్వాన్ని రద్దు చేసుకోవచ్చు
యూట్యూబ్‌ ప్రీమియం ధర సబ్‌స్క్రిప్షన్ వ్యవధి ఆధారంగా మారుతుంది. మూడు నెలల ప్లాన్ ధర రూ. 399, ఒక నెల ప్లాన్ రూ. 129, పన్నెండు నెలల ప్లాన్ ధర రూ. 1,290గా ఉంది