Sat May 04 2024 21:10:59 GMT+0000 (Coordinated Universal Time)
ఘనంగా బొండా ఉమ కొడుకు - ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె నిశ్చితార్థం
బొండా ఉమ కొడుకు సిద్ధార్థ్ కు, ఏవీ సుబ్బారెడ్డి కూతురు జశ్వంతికి నేడు కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది.
టిడిపి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ, ఆళ్లగడ్డ టిడిపి కీలక నేత ఏవీ సుబ్బారెడ్డిలు త్వరలోనే వియ్యంకులు కానున్నారు. బొండా ఉమ కొడుకు సిద్ధార్థ్ కు, ఏవీ సుబ్బారెడ్డి కూతురు జశ్వంతికి నేడు కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. కొన్నేళ్లుగా అమెరికా ఉంటున్న సిద్ధార్థ్-జశ్వంతి లు ప్రేమించుకున్నారు.
ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి అంగీకరించడంతో.. త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్-జశ్వంతిల ఎంగేజ్ మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ యువజంటకు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Next Story