Wed Apr 24 2024 15:14:43 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో బాగా తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 101 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 101 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,72,725 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,430 మంది మరణించారు.
కోలుకున్న వారి సంఖ్య...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,56,184 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 2,102 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,03,72,427 నమూనాలను పరీక్షించారు
Next Story