Fri Apr 26 2024 09:06:14 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఈరోజు కరోనా కేసులు ఎన్నంటే?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు తగ్గాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 159 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు తగ్గాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 159 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,73,252 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,444 మంది మరణించారు.
కోలుకున్న వారి సంఖ్య...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,56,670 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 2,149 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,04,75,940 నమూనాలను పరీక్షించారు
Next Story