Tue May 07 2024 01:20:12 GMT+0000 (Coordinated Universal Time)
జిల్లాల విభజన పై టీడీపీ కొత్త ప్రపోజల్
జిల్లాల విభజనపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొత్త ప్రతిపాదనను పెట్టారు.
జిల్లాల విభజనపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొత్త ప్రతిపాదనను పెట్టారు. అయిదు చిన్న జిల్లాలను విభజించవద్దని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా అనేది చాలా చిన్న జిల్లా అని ఆయన పేర్కొన్నారు. ఈ జిల్లాలోని నియోజకవర్గాలను విడగొట్టి నీటి యుద్ధాలకు తెరతీయవద్దని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. తాడేపల్లి కార్యాలయంలో కూర్చుని గీతలు గీసి జిల్లాలను విభజిస్తే జనం ఒప్పుకోరని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
తాము వ్యతిరేకం కాదు....
జిల్లాల విభజనకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, అయితే శాస్త్రీయంగా చేయాలన్నారు. పార్లమెంటు నియోజకవర్గాలుగా జిల్లాలను విభజించడం తగదని ఆయన సూచించారు. నెల్లూరు జిల్లాను విభజించవద్దని తాము ఎప్పటి నుంచోకోరుతున్నామని, అదే జరిగితే సోమశిల, కండలేరు జలాశయాల కింద ఉన్న ఆయకట్టు అయోమయంగా మారుతుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన చెందారు. నెల్లూరు జిల్లా నేతలందరూ జిల్లా విభజనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్ వద్ద గళం విప్పాలని సోమిరెడ్డి సూచించారు.
Next Story