Fri May 03 2024 11:30:12 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ వివేకా హత్య కేసులో నేడు?
నేడు సుప్రీంకోర్టులో వివేకా హత్య కేసు విచారణ జరగనుంది. నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు.
నేడు సుప్రీంకోర్టులో వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ జరగనుంది. నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. వివేకా హత్య కేసులో విచారణ జరుగుతున్నందున ప్రస్తుత సీబీఐ అధికారి రాంసింగ్ ను బదిలీ చేయాలని ఆమె తన పిటీషన్ లో పేర్కొన్నారు.
ఇప్పటికే సుప్రీంకోర్టు...
ఇప్పటికే సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందన్న దానిపై నిలదీసింది. దీంతో వివేకాహత్య కేసులో నేడు ఎలాంటి నిర్ణయం రాబోతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. రాంసింగ్ ను మార్చాలని ఆదేశిస్తే మరొక కొత్త అధికారి విచారణ చేపట్టే అవకాశముంది.
Next Story