స్పెషల్ స్టోరీస్: వెబ్ ప్రపంచంలో తెలుగు వార్తలకు గౌరవం పెరిగేలా, చాలా వున్నతమైన ప్రమాణాలతో, అతిరధ మహారధులైన జర్నలిస్టులు వ్రాస్తున్న విష్లేషణలు.
మా వెబ్ సైటు కే ప్రత్యేకమైన ఈ విష్లేషణలను చదివి ఆనందించండి.

ఒకరు ఆచి తూచి.. ఇంకొకరు ఆగమాగం

12/10/2017,06:00 సా.

రాజకీయ వ్యూహాలు పదునెక్కుతున్నాయి. లెక్క ప్రకారం చూస్తే ఇంకో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒకవేళ ముందస్తుకు పోదామనుకుంటే వచ్చే ఏడాది సరిగ్గా ఈ సమయానికి ఎన్నికల ఘంటారావం మోగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులిద్దరూ పార్టీ పరంగా అప్పుడే సైరన్ మోగించేశారు. సమీక్షలు, సమావేశాలు, పర్యటనలు, శిక్షణలు, సర్వేలతో [more]

‘వైరు’ లాగితే .. ‘షా‘ కు కొట్టింది

11/10/2017,10:00 సా.

వదిలించుకోగలిగితే మరక మంచిదే. బట్ట నాణ్యత, పారదర్శకత బయటపడుతుంది. అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ జోడు గుర్రాలుగా దూసుకుపోతూ రాజకీయంగా దేశాన్ని దున్నేస్తున్న మోడీ, అమిత్ షా ద్వయానికి సన్ స్ట్రోక్ తగిలింది. గోద్రా అనంతర ఘర్షణలు, గుజరాత్ ఎన్ కౌంటర్ల కు సంబంధించి వీరిరువురిపై విమర్శలు అనేకం [more]

మోడీని గుజరాత్ గజగజలాడిస్తుందా?

10/10/2017,11:59 సా.

ప్రధాని నరేంద్ర మోడీకి ఎన్నికల జ్వరం పట్టుకుంది. కళ్లు మూసుకున్నా, తెరచినా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలే గుర్తుకు వస్తున్నాయ. అందుకే అదే పనిగా గుజరాత్ పర్యటనకు వెళుతున్నారు. ఎడాపెడా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. చిన్నా చితకా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు కానిస్తున్నారు. ప్రధానమంత్రిగా ఊపిరి సలపని పనులతో [more]

ఇందిరకు….మోడీకి పెద్ద తేడా లేదే?

10/10/2017,11:00 సా.

భారత ప్రధానుల వ్యవహార శైలి ఒక్కొక్కరిదీ ఒక్కొక్క తీరు. ప్రధమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పరిపూర్ణ ప్రజాస్వామ్య వాది. ద్వితీయ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి ఉదారవాది. తృతీయ ప్రధాని ఇందిరాగాంధీ ప్రజాస్వామ్య నియంతగా పేరొందారు. తొలి కాంగ్రెసేతర ప్రధాని మురార్జీ దేశాయ్ మొండిఘటం. ఇందిర [more]

ఇలా వస్తే జగన్ ను జనం విశ్వసిస్తారా?

10/10/2017,09:00 సా.

పాత చింతకాయ పచ్చడి రాజకీయాలు మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో మొదలయ్యాయి. సకాలంలో, సరైన రీతిలో స్పందించి అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని ఇరకాటంలో పెట్టడంలో విఫలమవుతున్న వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా మళ్లీ ప్రత్యేక హోదా పల్లవి అందుకుంది. ప్రస్తుతం బీజేపీ, టీడీపీ అజెండాలో ఈ అంశం లేదు. [more]

వీరి ప్రత్యేక దేశం కల సాకారమయ్యేనా?

09/10/2017,11:59 సా.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ వర్గాలు, జాతులు, మతాలు, తెగల ప్రజల ప్రత్యేక అస్థిత్వం కోసం పోరాడుతున్నాయి. తమదైన గుర్తింపు, గౌరవం కోసం రోడ్డెక్కుతున్నాయి. పరాయి పంచన బతకడానికి ససేమిరా అంటున్నాయి. అటువంటి వారిలో కుర్దులు ఒకరు. వివిధ దేశాల్లో విస్తరించిన వారు ప్రత్యేక కుర్దిస్తాన్ కావాలంటున్నారు. తమది ప్రత్యేకమైన [more]

మోడీకి ఈ వర్గాలు దూరమవుతాయా?

09/10/2017,11:00 సా.

వృద్ధిరేటు, జీడీపీ, కరెంట్ ఖాతా లోటు వంటి అంశాలు సామాన్యుడికి కొరుకుడుపడని అంశాలు. కాస్తోకూస్తో మధ్యతరగతి ప్రజల్లో కొద్ది మందికి ఓ మోస్తరు అవగాహన ఉండవచ్చు. మేధావుల చర్చల్లో మాత్రం ప్రతిధ్వనిస్తుంటాయి. సాధారణ, మధ్యతరగతి ప్రజలు, మేధావులు ఎవరైనా కావచ్చు…. అంతిమంగా ధరలు, మరీ ముఖ్యంగా నిత్యావసర సరకుల [more]

జబర్దస్త్ జమిలీ….. పొలిటికల్ మోనోపలి

08/10/2017,01:00 సా.

దేశ రాజకీయ యవనికపై 1970 ల వరకూ కొనసాగిన రాజకీయ గుత్తాధిపత్యానికి మరోసారి పావులు కదులుతున్నాయి. స్వాతంత్ర్యోద్యమ చరిత్రతో తెచ్చుకున్న గుర్తింపుతో మూడు దశాబ్దాల పాటు కాంగ్రెసు పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యంతో తన హవా కొనసాగించింది. కేరళలో కమ్యూనిస్టులు, తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం వంటి పార్టీలు సవాళ్లు విసిరినా [more]

ఆఫ్ఘాన్ పై భారత్ నిర్ణయం సరైనదేనా?

07/10/2017,11:00 సా.

అంతర్యుద్ధంతో సతమతమవుతున్న ఆప్ఘనిస్తాన్ కు సైన్యాన్ని పంపబోం.. అన్న రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటన సంపూర్ణంగా స్వాగతించదగ్గది. ఇది సమయోచిత…సముచిత… సమోన్నత నిర్ణయం కూడా. ఇటీవల (సెప్బంబరు ఆఖరులో) అమెరికా రక్షణ మంత్రి మ్యాటిస్ భారత పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. ఒక్క సైన్యాన్ని మాత్రమే [more]

కొంచెం కష్టపడితే మోడీ కోటను కొట్టేయొచ్చా?

07/10/2017,10:00 సా.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలయింది. నాటి ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు గాను హస్తం పార్టీ సాధించిన స్థానాలు అక్షారాలా ఇరవై ఆరే. ఐదేళ్ల అనంతరం 1999లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో బరిలోకి దిగిన కాంగ్రెస్ [more]

1 191 192 193 194 195 196