టాప్ స్టోరీస్: సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలలో జరిగే రోజువారీ ముఖ్యాంశాల సమాహారాన్ని ఇక్కడ చదవండి.

నాలుగు వారాలు పవన్ షెడ్యూల్ ఇదే

17/01/2020,06:04 సా.

బీజేపీ, జనసేన పొత్తు ఖరారవ్వడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఈ నెలాఖరు నుంచి నియోజకవర్గ ఇన్ ఛార్జులతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. మొత్తం నాలుగు వారాల పాటు పవన్ కల్యాణ్ షెడ్యూల్ ఖరారయింది. నియోజకవర్గ ఇన్ ఛార్జులతో పాటు గత [more]

బ్రేకింగ్ : ఉరి 22న కాదట

17/01/2020,05:17 సా.

నిర్భయ దోషులకు ఈ నెల 22వ తేదీన ఉరి అమలు చేయాలని గతంలో న్యాయస్థానం డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే నిర్భయ దోషులకు రాష్ట్రపతి క్షమాబిక్షను తిరస్కరించారు. నిబంధనల ప్రకారం రాష్ట్రపతి క్షమాబిక్ష తర్వాతనే ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంటుంది. ఈనెల 22వ తేదీన [more]

బ్రేకింగ్: ఏపీ కేబినెట్ సమావేశం రేపు

17/01/2020,04:43 సా.

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం రేపు జరగనుంది. వాస్తవానికి ఈ నెల 20వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం జరగాల్సి ఉండగా, రేపటికి దానిని ప్రభుత్వం మార్చింంది. రేపు మధ్యాహ్నం 3గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. [more]

బ్రేకింగ్ : కోర్టులో జగన్ కు షాక్

17/01/2020,01:44 సా.

సీబీఐ కేసులో జగన్ కు చుక్కెదురయింది. అన్ని చార్జిషీట్లను కలిపి ఒకేసారి విచారించాలన్న జగన్ పిటీషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఈరోజు మాత్రం వ్యక్తిగత హాజరు నుంచి జగన్ కు మినహాయింపు నిచ్చింది. అయితే ఒక్కో ఛార్జి షీట్ పై విచారణ జరుగుతుండటంతో ప్రతి వారం కోర్టుకు [more]

అలాగే ముందుకు వెళ్తాం

17/01/2020,01:32 సా.

ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ముందుకు వెళతామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రేపు హై పవర్ కమిటీ మరోసారి సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రి జగన్ కు వివరించామని చెప్పారు. సీఆర్డీఏను రద్దు చేస్తున్నట్లు తనకు తెలియదన్నారు. మీడియాలో వస్తే తాను చూశానని బొత్స [more]

ఏపీపై సీరియస్ కామెంట్స్

17/01/2020,01:09 సా.

తెలంగాణ మంత్రి కేటీ రామారావు ఏపీ రాజకీయాలపై సీరియస్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో అనేక జిల్లాలను ఏర్పాటు చేసినా ప్రజల నుంచి రవ్వంత వ్యతిరేకత రాలేదని, ఆంధ్రప్రదేశ్ లో ఎందుకంత వ్యతిరేకత వస్తుందో ప్రభుత్వమే తెలుసుకోవాల్సి ఉందనిఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడటం వేస్ట్ [more]

హైకోర్టు సీరియస్

17/01/2020,01:00 సా.

అమరావతిలో పోలీసులు మహిళల పట్ల వ్యవహరించిన తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 144 సెక్షన్, పోలీస్ యాక్టు అమలు చేయవద్దని సుప్రీంకోర్టు సూచించినా ఎందుకు అమలు చేశారని ప్రశ్నించింది. రాజధాని ప్రాంతంలో పరేడ్ చేయాల్సిన పనేముందని నిలదీసింది. అయితే రాజధాని ప్రాంతంలో ప్రశాంత పరిస్థితులు ఉన్నాయని [more]

బ్రేకింగ్ : షాతో జగన్ …?

17/01/2020,11:46 ఉద.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షాతో రేపు జగన్ భేటీ కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే జగన్ అమిత్ షా అపాయింట్ మెంట్ కోరినట్లు తెలిసింది. ఇంకా అపాయింట్ మెంట్ ఖరారు కాలేదని సమాచారం. అమిత్ షా అపాయింట్ మెంట్ దొరికితే రేపు జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ [more]

వచ్చే వారం తేలనుందా?

17/01/2020,11:16 ఉద.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీబీఐ కోర్టుకు హాజరవ్వాలా? వద్దా? అనే విషయంపై వచ్చే వారం సీబీఐ కోర్టు తీర్పు చెప్పనుంది. నేడు శుక్రవారం కావడంతో జగన్ మినహా మిగిలిన వారు కోర్టుకు హాజరయ్యారు. విజయసాయిరెడ్డి ఈరోజు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతోపాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ [more]

జూపల్లి ఎదురుతిరిగాడు

17/01/2020,10:29 ఉద.

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి చెందిన 20 మంది అభ్యర్థులను రంగంలోకి దించారు. గత ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి జూపల్లి కృష్ణారావు ఓటమి పాలయ్యారు. గెలిచిన హర్హవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిపోయారు. [more]

1 2 3 1,573