టాప్ స్టోరీస్: సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలలో జరిగే రోజువారీ ముఖ్యాంశాల సమాహారాన్ని ఇక్కడ చదవండి.

మమతా దీదీ పోరాటానికి ఫలితం ఉంటుందా?

13/11/2016,08:27 సా.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక తొందరపాటు ప్రకటన చేసేశారు. తాను పోరాటాన్ని లీడ్ చేస్తానంటూ గట్టిగా ఒక ప్రకటన చేశారు. కానీ అది వాస్తవంగా.. ఎలాంటి ఫలితం రాబట్టలేని నిష్ఫలమైన పోరాటం. ప్రజల్లో మెజారిటీనుంచి తన వాదనకు మద్దతు లేకుండా,‘‘ప్రజల తరఫున, ప్రజల కోసం‘’ అనే [more]

యువరాజు పిలుపు : బ్యాంకుల వద్ద కాంగ్రెస్ చలివేంద్రాలు

13/11/2016,11:10 ఉద.

దేశంలోని ప్రజలకు సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ప్రధానంగా బ్యాంకులవద్ద పెద్దనోట్లు మార్చుకోవడానికి క్యూలలో నిల్చుని ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సేవ చేయాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిసైడ్ అయ్యారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. బ్యాంకులు ఏటీఎం లు [more]

నోట్ల దెబ్బ : ఇదొక భూకంపం అంటున్న మోదీ

13/11/2016,10:59 ఉద.

పెద్ద నోట్ల రద్దు అనే నిర్ణయానికి భారత జాతి యావత్తూ అతలాకుతలం అయిపోతున్న సంగతి అందరికీ స్వానుభవంలో ఉన్నదే. ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేంద్రాన్ని విపక్షాలు మినహా ప్రజలు పరిమితంగానే నిందిస్తూ.. తమ కష్టాలు తాము పడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న [more]

నాన్-సీరియస్ : జగన్ నల్లడబ్బు గురించి జనానికి టెన్షన్ !!

13/11/2016,10:26 ఉద.

విపక్షనేత వైఎస్ జగన్మోహన రెడ్డి తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా అక్రమాలకు పాల్పడ్డాడా? అడడ్డగోలుగా అక్రమ సంపాదన పెంచుకున్నాడా? ఇంతలోతు విషయాల మీద జనానికి ఎవ్వరికీ స్పష్టత లేదు. వాళ్లూ వీళ్లూ చెప్పుకుంటున్న దాన్ని బట్టి ఎవరైనా ఓ అభిప్రాయానికి రావాల్సిందే తప్ప.. వాస్తవం ఎవ్వరికీ తెలియదు. అయితే [more]

రాజకీయ వ్యూహం  : రివర్స్ గేర్ లో ‘మన్ కీ బాత్’

13/11/2016,09:59 ఉద.

‘మన్ కీ బాత్’ అంటే ఈ దేశ ప్రజలకు ఇప్పటిదాకా తెలిసింది ఒక్కటే. ప్రధాని నరేంద్రమోదీ ఆల్ ఇండియా రేడియో ద్వారా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ ప్రసంగాన్ని లైవ్ లో రేడియో ద్వారాను, తర్వాత టీవీల ద్వారాను, పత్రికల ద్వారాను దేశ ప్రజలందరికీ ఆయన ఆలోచనలు, దేశం [more]

ముచ్చటైన ఆటతో సరికొత్త హీరో హసీబ్ హమీద్!

13/11/2016,09:45 ఉద.

రాజ్‌కోట్ లో చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్‌కు రంగం సిద్ధం అయింది. మ్యాచ్ నిర్వహణకు సంబంధించి బీసీసీఐకు ఉన్న కష్టాలుకూడా ముందురోజు తొలగిపోయాయి. టాస్ ఇంగ్లాండ్‌కు అనుకూలంగా పడింది. ఓపెనర్లు బరిలోకి వచ్చారు. ఇప్పటిదాకా క్రికెట్ ప్రేక్షక ప్రపంచం చూసి ఎరగని.. ఇంకా నూనూగు మీసాలు కూడా రాని ఓ [more]

భలే నిర్ణయం తీసుకున్న కేసీఆర్!

13/11/2016,06:16 ఉద.

నోట్ల కష్టాలు పడుతున్న ప్రజల్లో కొందరికి ఇది మంచి ఊరట. కనీసం తెలంగాణలో నగరాల్లో, పట్టణాల్లో అయినా పరిమితంగా కొంత శాతానికి చెందిన ప్రజలకు అయినా చక్కటి శుభవార్త లాంటి కబురును సీఎం కేసీఆర్ తీసుకున్నారు. తెలంగాణలో అక్రమ నిర్మాణాలు, భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి చాలా కాలంగా ప్రక్రియ [more]

పెద్దాయన సూచన భేష్.. సర్కారుకు వినిపిస్తుందా?

13/11/2016,02:40 ఉద.

ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే చేస్తుంటాయి. వాస్తవికమైన ప్రజాసంక్షేమం , స్థిరత్వంతో కూడిన అభివృద్ధి మీద వారికి దృష్టి తక్కువగా ఉంటుంది. ప్రజల దృష్టిని తక్షణం ఆకర్షించగల గిమ్మిక్కుల మీద ఉన్నంత శ్రద్ధ స్థిరమైన పోకడల మీద ఉండదు. ఒక రకంగా ఇప్పుడు నల్లధనం నియంత్రణకు జరుగుతున్న [more]

అరుణ్ జైట్లీ : బాధ్యత మరచిన పలాయనవాదం!

12/11/2016,05:35 సా.

నల్లధనం కట్టడి ప్రయత్నాల్లో భాగంగా.. మోదీ సర్కారు నోట్ల మార్పిడి వ్యవహారాన్ని హఠాత్తుగా  తెరమీదకు తీసుకువచ్చింది. దానివల్ల దేశం మొత్తం అతలాకుతలం అవుతోంది. పరిమితంగా కొందరు మోదీ నిర్ణయాన్ని తూర్పారపడుతున్నా.. మెజారిటీ కష్టాలు పడుతూ సర్దుకుంటూనే ఉన్నారు. ఒకవైపు దేశవ్యాప్తంగా ప్రజలు ఇలా ఇబ్బందులు పడుతోంటే.. మోదీ జపాన్ [more]

మాటలు మాని.. నిర్మాణాత్మక పోరాటానికి దిగాలి

12/11/2016,11:39 ఉద.

తెలంగాణలో కేసీఆర్ సర్కారు మీద విపక్షాలు ఏచిన్న అవకాశం దొరికినా విరుచుకుపడుతూనే ఉన్నాయి. రైతు అంశాలు, విద్యార్థి అంశాల మీద ధర్నాలు, సభలు నిర్వహిస్తూ పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక గళం విప్పడానికి ఎలాంటి అవకాశం ఉన్నా విపక్షాలు వదలుకోవడం లేదు. తెలుగుదేశంపార్టీ తరఫున తెంగాణలో కేసీఆర్ [more]

1 1,374 1,375 1,376 1,377 1,378 1,430