టాప్ స్టోరీస్: సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలలో జరిగే రోజువారీ ముఖ్యాంశాల సమాహారాన్ని ఇక్కడ చదవండి.

బ్రేకింగ్ : బొత్స బాంబు పేల్చారే

20/08/2019,05:25 సా.

రాజధాని నిర్మాణం విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో పోలిస్తే అమరావతిలో నిర్మాణవ్యయం ఎక్కువని చెప్పారు. అమరావతిలో ఫ్లై ఓవర్లు, భారీ కట్టడాలను నిర్మించాల్సి ఉంటుందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇతర [more]

చిదంబరానికి హైకోర్టు షాక్

20/08/2019,05:04 సా.

మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి హైకోర్టు షాకిచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చిదంబరం ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను విచారించిన హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.

నా ఇంటి గురించి బెంగ వద్దు

20/08/2019,02:18 సా.

ప్రభుత్వం సృష్టించిన వరదగానే చూడాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి పరామర్శించారు. తన ఇంటికేం కాదని, తన ఇంటి గురించి వైసీపీ నేతలకు ఎందుకు బెంగ అని ప్రశ్నించారు. వరద బాధితులను ప్రభుత్వం పూర్తిగా వదిలేసిందన్నారు. అన్నా క్యాంటీన్లు కూడా [more]

17 మంది ప్రమాణ స్వీకారం

20/08/2019,12:00 సా.

కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొద్దిసేపటి క్రితం యడ్యూరప్ప తన మంత్రివర్గాన్ని విస్తరించారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 17 మంది బీజేపీ శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీటీ రవి, బసవరాజ్ బొమ్మయ్, కోట శ్రీనివాస్ పూజారి, జేసీ మధుస్వామి, చంద్రకాంత్ [more]

కోడెల అంగీకరించారు

20/08/2019,11:35 ఉద.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి కొంత ఫర్నీచర్ తన దగ్గర ఉందని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అంగీకరించారు. హైదరాబాద్ నుంచి అమారావతికి తరలించేటప్పుడు కొంత ఫర్నీచర్ ను తాను ఉపయోగించుకున్నానన్నారు. ఫర్నీచర్ ను తీసుకెళ్లాలని పలుమార్లు అసెంబ్లీ అధికారులు దృష్టికి తాను తీసుకెళ్లినా వారు స్పందించలేదన్నారు. దీనిపై వారికి [more]

జగన్ ఫిక్స్ చేశారు

20/08/2019,09:56 ఉద.

వచ్చే నెలలో వైఎస్ జగన్ జిల్లాల పర్యటన ఫిక్స్ అయింది. ఆయన వచ్చే నెల 2వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. అమెరికా నుంచి రాగానే జగన్ జిల్లాల షెడ్యూల్ ఖరారవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించి మూడు నెలలవుతున్నా జగన్ జనంలోకి వెళ్లలేదు. ఇప్పటి [more]

రూ. 500 కోట్ల పనుల రద్దు

20/08/2019,09:21 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో మరో 500 కోట్ల పనులు రద్దయ్యాయి. ఈమేరకు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది పంచాయతీరాజ్ శాఖకు చెందిన రూ500 కోట్ల విలువైన పనులను రద్దు చేశారు. ఎన్నికలకు ముందు లబ్డి చేకూర్చేందుకే ఈ పనులను కొందరికి కట్టబెట్టినట్లు గుర్తించారు. ఎక్కువగా ఈ పనులన్నీ గుంటూరు జిల్లాలోనే [more]

బాబూ ఇది తెలుసుకో

20/08/2019,09:16 ఉద.

వరదనీరు ఎంత విడుదల చేయాలన్నది ఇంజీనీర్లు నిర్ణయిస్తారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన చంద్రబాబుపై తాజాగా ట్వీట్ చేశారు. ఇంజినీర్లకు డ్యాం భద్రత ముఖ్యమన్నారు. అంతేకాని చంద్రబాబు ఇల్లు మునిగిపోవాలని ఎవరూ నీరు విడుల చేయరని గుర్తుంచుకోవాలని, వరద రాజకీయం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని విజయసాయి [more]

ఏపీ అసెంబ్లీలో ఫర్నీచర్ మాయం

20/08/2019,09:11 ఉద.

ఆంధ్ర్రప్రదేశ్ అసెంబ్లీలో ఫర్నిచర్ మాయమయింది. ఈ మేరకు అసెంబ్లీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించేటప్పుడే ఫర్నిచర్ మాయమయిందని కొందరు చెబుతుండగా, కోడెల శివప్రసాద్ హయాంలోనే అసెంబ్లీలో ఫర్నిచర్ మాయమయిందని మరికొందరు అంటున్నారు. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు. కేసు ఇంకా నమోదు చేయనప్పటికీ అసెంబ్లీలో [more]

హీరో తరుణ్ కు తప్పిన ప్రమాదం?

20/08/2019,09:04 ఉద.

టాలీవుడ్ హీరో తరుణ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలోని నార్సింగ్ వద్ద డివైడర్ ను ఢీకొనింది. అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత తరుణ్ వేరే కారులో వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో తరుణ్ [more]

1 2 3 4 1,431