Fri May 03 2024 02:17:31 GMT+0000 (Coordinated Universal Time)
కూకట్ పల్లిలో థియేటర్ దగ్గం... రెండు కోట్ల నష్టం
కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న శివపార్వతి థియేటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
కూకట్ పల్లిలోని ఒక సినిమా థియేటర్ పూర్తిగా అగ్నికి ఆహుతయింది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న శివపార్వతి థియేటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. థియేటర్ పూర్తిగా తగలబడి పోయింది. ఈ ప్రమాదంలో రెండు కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబతున్నారు.
సెకండ్ షో పూర్తయిన తర్వాత....
అయితే నిన్న రాత్రి సెకండ్ షో పూర్తయిన తర్వాత ఈ ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. తెల్లవారు జామున 3.30 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని మాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చినట్లు అగ్ని మాపక సిబ్బంబది తెలిపారు.
Next Story