Sat May 04 2024 19:06:08 GMT+0000 (Coordinated Universal Time)
నారాయణ కళాశాలలో వార్డెన్ గా పని చేస్తూ.. చదువుకుంటున్న భవానీ
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని అయ్యప్ప సోసైటీలో ఉన్న నారాయణ కళాశాలలో
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని అయ్యప్ప సోసైటీలో ఉన్న నారాయణ కళాశాలలో పనిచేస్తున్న భవాని అనే మహిళా వార్డెన్ ఆత్మహత్య చేసుకుంది. భవాని నారాయణ కాలేజ్‌లోనే డిగ్రీ చదువుతూ అదే కాలేజీలో అసిస్టెంట్ వార్డెన్‌గా పనిచేస్తోంది. క్యాంపస్‌లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శుక్రవారం రోజున ఉదయం సమయంలో కళాశాల రూమ్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం ఆత్మహత్య చేసుకోగా.. ఈ ఘటన గురించి కుటుంబ సభ్యులకు మాత్రం మధ్యాహ్నం ఒకటిన్నరకు ఈ విషయాన్ని చెప్పింది కాలేజీ యాజమాన్యం. దీంతో భవాని మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Next Story