
నిత్యానంద రాసలీలలు నిజమేనని.ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారణ చేసింది. ఈ మధ్య భారత దేశంలో దొంగ బాబాల గుట్టు ఒక్కొక్కటీ బయట పడుతున్నాయి. ఈ మద్య గుర్మిత్ రామ్ రహీం అలియాస్ డేరా బాబా ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో దొంగ సామి..గుట్టు బయట పెట్టింది ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబరేటరీ. 2010లో సినీ నటి రంజిత, స్వామి నిత్యానంద సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి బహిర్గతమైన సంగతి తెలిసిందే. తన అనుంగు శిష్యురాలు, నటి రంజితతో కలిసి వీడియో టేపుల్లో సన్నిహితంగా ఉన్నది నిత్యానందేనని స్పష్టమైంది. ఈ మేరకు ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ బుధవారం నవంబర్ 22 రిపోర్టు ఇచ్చింది. సదరు వీడియో టేపుల్లో నటి రంజితతో కలిసి రాసలీలల్లో మునిగితేలింది తాను కాదని, తనను అప్రతిష్ట పాలు చేయడానికే కొంత మంది మార్ఫింగ్ చేసి, ఆ వీడియోలను బయటపెట్టారని నిత్యానంద ఇప్పటివరకూ వాదిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆ వీడియో టేపులు వాస్తవమా? కాదా?.. వాటిని ఎవరైనా తయారు చేసి స్వామీజీ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేశారా? అన్నది నిగ్గుతేల్చేందుకు ఆ టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఈ టేపులను శాస్త్రీయంగా విశ్లేషించిన ఫోరెన్సిక్ ల్యాబ్ అది నిజమేనని తేల్చింది. దీంతో నిత్యానంద బాగోతం బయటపడినట్లే.
Leave a Reply