ఆ రెండింటిపైనే చంద్రబాబు భవిష్యత్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కల నెరవేరుతుందా? వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లాలంటే ఆయన రెండు ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకటి అమరావతి నగరంలో కొంత భాగాన్నైనా ప్రజలకు చూపించాల్సి ఉంది. మరొకటి పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలే. ప్రజలు కోరుకున్నవి కావు. ఆయన ప్రతి సమావేశంలో పదే పదే పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేస్తామని చెబుతూ వస్తున్నారు. అలాగే రాజధాని నిర్మాణం కూడా పూర్తవుతుందని చెబుతున్నారు.అయితే ప్రస్తుతం ఏపీలో పరిస్థితులను బట్టి చూస్తంటే ఈ రెండు సాధ్యమయ్యేటట్లు కన్పించడం లేదు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి ప్రతి సోమవారం సమీక్ష చేస్తూనే ఉన్నారు. దాదాపు నెలకొకసారి పోలవరం వెళ్లి పనుల తీరును పరిశీలించి వస్తున్నారు. కాని 2018 నాటికి పోలవరం నిర్మాణం పూర్తి కావడం కష్టమేనని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే ఇంకా పనిచేయడానికి కావాల్సిన కొన్ని ముఖ్యమైన యంత్రాలే ఇంకా అక్కడికి చేరుకోలేదు. కాని ముఖ్యమంత్రి మాత్రం పోలవరాన్ని పూర్తి చేయాలన్న పట్టుదలతోనే ఉన్నారు.

నిర్మాణ పనులే ప్రారంభం కాలేదు…..

ఇక రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇంకా డిజైన్లే ఖరారు కాలేదు. రెండు నెలల్లో పనులు ప్రారంభించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రాజధాని నగరంలో మొత్తం 9 నగరాలను విడివిడిగా నిర్మించాలన్నది చంద్రబాబు ఆకాంక్ష. అయితే డిజైన్ల ఖరారులోనే ఎక్కువ జాప్యం జరిగింది. డిజైన్ల ఖరారు పూర్తయిన తర్వాతనే ప్రారంభమవుతుంది. సింగపూర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం రాజధాని పనులను వేగవంతం చేయాలని భావిస్తోంది. 2019 తొలి మాసం నాటికి రాజధానికి ఒక రూపురేఖలు తేవాలని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లడం కష్టమవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నా న్యాయస్థానాల జోక్యాలు, పర్యావరణ సంస్థల మొట్టికాయలు వంటి వాటితో పనుల్లో అనివార్యంగా జాప్యం జరుగుతోంది. ఈ రెండు పనులూ ముఖ్యమంత్రి చెప్పినట్లు పూర్తికాకుంటే ఆయనకు వచ్చే ఎన్నికల్లో కష్టాలు తప్పవు. దీంతో అధికారుల వెంట పడుతున్నారు ముఖ్యమంత్రి. మొత్తం మీద ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ చంద్రబాబుకు ఈ రెండు పనులు పూర్తవుతాయా? లేదా? అన్న ఆందోళన పట్టుకుంది.

Ravi Batchali
About Ravi Batchali 26901 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

1 Comment on ఆ రెండింటిపైనే చంద్రబాబు భవిష్యత్

Leave a Reply

Your email address will not be published.


*