ఈ ఏపీ మంత్రులకు ఉద్వాసన తప్పదా?

ఏపీలో మరోమారు క్యాబినెట్‌ విస్తరణ జరిగేలా కనిపిస్తోంది. కొద్ది నెలల క్రితమే క్యాబినెట్‌ విస్తరణ జరగగా మరికొందరిని మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉండటంతో దానిని పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరు మంత్రులకు ఉద్వాసన తప్పదని విస్త్రతంగా ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా మంత్రి పదవులు కోల్పోయిన వారి విషయంలో కూడా ఇదే తరహా వార్తలు వచ్చాయి. తాజాగా బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులు కామినేని., మాణిక్యాల రావుల స్థానంలో విష్ణుకుమార్‌ రాజు., సత్యనారాయణలకు అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. ఇక టీడీపీ నుంచి పదవులు కోల్పోయే వారిలో అచ్చెన్నాయుడు., శిద్దా రాఘవరావు., భూమా అఖిల ప్రియ., గంటాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మంత్రిత్వ శాఖలపై ఆరోపణలు., పనితీరు బాగోకపోవడం., పదేపదే క్యాబినెట్‌ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురవడం వంటి అంశాలను బట్టి వేటు వేసే ముందు ముఖ్యమంత్రి ఈ తరహా సంకేతాలు ఇస్తారని సన్నిహితులు చెబుతున్నారు. గతంలో పదవులు కోల్పోయిన వారందరి విషయంలో ఇలాగే జరిగిందని ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్న మంత్రులపై వేటు తప్పదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు తగ్గట్లుగా పనిచేయలేకపోతున్న వారిని కూడా పదవుల నుంచి తప్పించే అవకాశం ఉంది.

వీరి పట్ల తీవ్ర అసంతృప్తిలో సీఎం…..

ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో మిత్ర పక్షాలకు కూడా ఈ మేరకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి కామినేని శ్రీనివాస్‌ నిర్వహిస్తోన్న వైద్య ఆరోగ్య శాఖ తీరుపై చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కామినేని ఏ మాత్రం సీరియస్‌గా వ్యవహరించలేకపోవడం., వివాదాలు., ఆరోపణలు వంటి కారణాలతో కామినేనికి ఉద్వాసన తప్పదని చెబుతున్నారు. మరోవైపు మంత్రి మాణిక్యాల రావు కూడా తన పదవిపై అసంతృప్తిగా ఉన్నారు. పేరుకు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నా ఆయనకు ఏమి సంబంధం లేకుండానే అన్ని నడిచిపోవడంపై ఆయన అసహనంగా ఉంటుంన్నారు. జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ప్రతి పనిలో జోక్యం చేసుకోవడంపై ఆయన సన్నిహితుల వద్ద తరచూ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం ముఖ్యమంత్రి దృష్టికి సైతం వచ్చింది. దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనానికి వచ్చిన మంత్రిని దాదాపు అరగంటకు పైగా గేట్లు తాళం వేసి నిలబెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ మంత్రికే ఈ దుస్థితి అని అందరి ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాణిక్యాల రావు స్థానంలో మరొకరిని క్యాబినెట్‌లోకి తీసుకుంటారని కూడా ప్రచారం జరుగుతోంది.ఇక మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు కూడా ఉద్వాసన తప్పకపోవచ్చు. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేతలు కోడెల., యరపతినేని., జివి.ఆంజనేయులు., ధూళిపాళ వంటి వారు మంత్రి పదవి ఆశిస్తున్నారు. జిల్లాలు., కుల సమీకరణల ఆధారంగా మంత్రి వర్గాన్ని బ్యాలెన్స్‌ చేసేందుకు ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Ravi Batchali
About Ravi Batchali 40561 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*