ఈ మూడు రోజులూ ఏపీ పోలీసులకు సవాలే

ap police alert

ఆంధ్రప్రదేశ్ పోలీసులు పెద్ద సవాల్ నే ఎదుర్కోనున్నారు. కోనసీమ నుంచి ఆర్కేబీచ్ వరకూ శాంతిభద్రతల పర్యవేక్షణ కు పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. వచ్చే మూడు రోజులూ ఏపీలో పోలీసులకు పెద్ద పరీక్షే ఎదురుకానుంది. ఏపీ డీజీపీ వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు సంబంధిత జిల్లాల ఎస్పీలతో మాట్లాడుతూ నిరంతరం ఈ రెండు జిల్లాలపైనే నిఘా ఉంచారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఆదేశాలను అమల్లోకి తెస్తోంది జిల్లా యంత్రాంగం.

కోనసీమపై కాన్సన్ ట్రేషన్….

బుధవారం అంటే 25వ తేదీన రావులపాలెం నుంచి ముద్రగడ పాదయాత్ర ప్రారంభం కానుంది. దీనికి పోలీసులు అనుమతివ్వలేదు. అయినా ముద్రగడ పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాపు జేఏసీ కూడా పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఒక వర్గానికి చెందిన కార్యక్రమం కావడంతో పోలీసులు సున్నితంగా వ్యవహరించాల్సి ఉంది. అసలే రెండుసార్లు ముద్రగడ దీక్షను, పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఈసారి కూడా అడ్డుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని కాపు జేఏసీ హెచ్చరించింది. తాము శాంతియుతంగా…గాంధేయ మార్గంలోనే పాదయాత్ర నిర్వహిస్తామని చెబుతోంది. ఒకవేళ ముద్రగడ యాత్రకు అనుమతిస్తే అవాంఛనీయ సంఘటను జరిగితే దానికి ఎవరు జవాబుదారీ అని కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. అందుకోసమే ఆయనను యాత్ర ప్రారంభానికి ముందే అదుపులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ముద్రగడను అదుపులోకి తీసుకున్నా పోలీసులు కొన్ని రోజుల పాటు కోనసీమలో మకాం వేసి లా అండ్ ఆర్డర్ ను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇప్పటికే పది వేల మంది పోలీసులు కోనసీమ మొత్తం మొహరించారు.

రిపబ్లిక్ డే…ఆర్కే బీచ్……
మరోవైపు గురువారం విశాఖ ఆర్కే బీచ్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను కోరుతూ నిరసన కార్యక్రమం చేపడుతోంది. ఇప్పటికే 13 జిల్లాల నుంచి యువత విశాఖకు చేరుకుంటున్నారు. ఏపీలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు ఈ నిరసనలో పాల్గొనేలా నిర్వాహకులు సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపారు. వీరికి తోడు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయితే ఏకంగా హోదాను సాధించేంత వరకూ పోరాడదాం…అవసరమైతే ప్రాణాలర్పిద్దాం అంటూ తాజాగా ట్వీట్ చేయడంతో పోలీసులు హడలి పోతున్నారు. విద్యార్థి సమూహాన్ని అదుపు చేయాలంటే ఎలా అని ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. అందుకే రైళ్లలో, బస్సుల్లో వచ్చే వారిని ఎక్కడికక్కడ నిర్భంధించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి లక్షల సంఖ్యలో చేరితే ఏ సమయమైనా…ఎలాంటి సంఘటనైనా జరిగే అవకాశముందని పోలీసు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఆర్కే బీచ్ వద్ద బందోబస్తు నిర్వహించడంతో పాటు గురువారం రిపబ్లిక్ డే వేడుకలు కూడా జరగనుండటంతో ఏపీ పోలీసులకు పెను సవాలుగా మారింది.

Ravi Batchali
About Ravi Batchali 39095 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*