ఈ ….హీరోలంటే డీజీపీకి భయమా?

సంక్రాంతికి వీధుల్లో ముగ్గులే కాదు. వీధుల్లో హరిదాసులే కాదు. గంగిరెద్దుల మువ్వల చప్పుళ్లే కాదు. ఆకాశంలో పతంగులే కాదు. సిల్వర్ స్క్రీన్ పై ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. వీటికోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా గేట్లు తెరుచుకుంటాయా? తమ అభిమాన హీరోని చూద్దామా అన్నంత రేంజ్ లో ఫ్యాన్స్ పిచ్చెక్కి ఉన్నారు. ఇదే పోలీసులకు తలనొప్పిగా మారింది. సినిమాల విడుదల విషయంలో ఓ పోలీసు ఉన్నతాధికారి జోక్యం చేసుకోవడం ఇంతవరకూ వినలేదు. కనలేదు. ఇదిగో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డీజీపీ మిగతా పనులను పక్కన బెట్టి సినిమా రిలీజ్ ల పైనే తన దృష్టిని కేంద్రీకరించి ఉన్నారు. ఆయనెవరో కాదు. ఏపీ డీజీపీ సాంబశివరావు. ఆ సినిమాలు ఎవరివో కాదు మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణకు సంబంధించిన సినిమాలు.

నిఘా సంస్థల నివేదికతోనేనా?

ఆంధ్రప్రదేశ్ డీజీపీ తన కార్యకలాపాలు పక్కన బెట్టి మరీ శనివారం సినిమాల విడుదలపై దృష్టి పెట్టారట. సంక్రాంతికి యువరత్న బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి రిలీజ్ అవుతుంది. అలాగే అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా ఖైదీ నెంబరు 150 మూవీ  కూడా విడుదలవబోతోంది. యువరత్న బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు పండగే పండగ. సంక్రాంతి కంటే ఎక్కువగా పండగ చేసుకుంటామంటున్నారు ఇద్దరి అభిమానులు. ఇదే కొంపముంచబోతుందని డీజీపీ గారికి అనుమానమొచ్చినట్లుంది. ఆయన శనివారం ప్రత్యేకంగా 13 జిల్లాల ఎస్పీలకు స్పెషల్ ఆదేశాలు ఇచ్చారు. ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయని, వాటి విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అభిమానులు హద్దు మీరితే కఠినంగా వ్యవహరించాలని కూడా ఆదేశాల్లో డీజీపీ పేర్కొన్నారు. అభిమానులు సంయమనం పాటించాలని…పండగ వాతావరణాన్ని కలుషితం చేయొద్దని డీజీపీ రిక్వెస్ట్ చేశారు. హీరో ఏవర్గమైనా..హీరో ఎవరైనా ఒకరికొకరు రెచ్చగొట్టుకునే చర్యలకు పాల్పడితే సహించేది లేదని డీజీపీ హెచ్చరించారు. వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు చించేసినా…సోషల్ మీడియాలో అభ్యంతరకర సందేశాలు పంపినా ఊర్కొనేది లేదని డీజీపీ వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడైనా చూశామా…? ఒక రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి సినిమాల విడుదల విషయంలో ఈ స్థాయిలో ఆదేశాలు జారీ చేశారంటే…ఏమై ఉంటుంది.? అలర్లు జరుగుతాయని ఇంటలిజెన్స్ రిపోర్టు ఏమైనా అందిందా..? లేక ముందు జాగ్రత్త చర్యగానే ఆదేశాలు జారీ చేశారా? అన్నది మాత్రం తెలియకుండా ఉంది. మొత్తం మీద సినిమాల విడుదల విషయంలో పోలీస్ బాస్ ఆదేశాలు చూసి 13 జిల్లాల ఎస్పీలు అవాక్కయ్యారట. ఎన్నడూ లేని విధంగా డీజీపీ ఇలా స్పందించారేమిటని ఒకరికొకరు ఫోన్ చేసి మరీ చర్చించుకుంటున్నారట. ఇదండీ సంగతి. పోలీస్ బాస్ అన్నీ పక్కన బెట్టి ఆ హీరోల సినిమాల రిలీజ్ పైనే టెన్షన్ పడుతున్నారట.

Ravi Batchali
About Ravi Batchali 32294 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*