ఉత్తర కొరియాకు ట్రంప్ భయపడ్డారా?

రెండు భిన్న ధృవాలు కలుస్తాయా? కలవవన్నది నిజం. కాని ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్ లు ఇద్దరూ త్వరలో కలవబోతున్నారట. సాక్షాత్తూ వైట్ హౌస్ అధికారిక ప్రకటన చేసింది. అణ్వస్త్రాల ప్రయోగంపై ఉత్తర కొరియాకు, అమెరికాకు మధ్య మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా బెదిరింపులకు ఉత్తరకొరియా అధ్యక్షుడు ఏమాత్రం తగ్గడం లేదు. సై అంటే సై అంటున్నారు. ట్రంప్ కూడా నిన్నటి వరకూ ఉత్తర కొరియాకు వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇచ్చారు. అయినా ఉత్తర కొరియా ఏమాత్రం వెనకడుగు వేయకపోవడంతో ట్రంప్ ఒక మెట్టు కిందకు దిగివచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తో అమెరికా అధ్యక్షుడు త్వరలో సమావేశమవుతున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైనర్ వెల్లడించారు.

భేటీపై అమెరికా షరతులు…..

కాని ట్రంప్, కిమ్ జాంగ్ ల భేటీ ఎప్పుడు ఉంటుందనేది తెలియపర్చలేదు. సరైన సమయంలో మాత్రమే అమెరికా అధ్యక్షుడు ఉత్తర కొరియా అధ్యక్షుడితో భేటీ అవుతారని మాత్రమే చెప్పారు. అయితే ఈ భేటీ జరగాలంటే ఉత్తర కొరియా కొన్ని షరతులకు అంగీకరించాల్సి ఉంటుందని కూడా వైట్ హౌస్ వర్గాలు చెప్పాయి. ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకునేందుకు వీలుగా శాంతియుత వాతావరణం కల్పించాలని, అమెరికాతో పాటు ఇతర దేశాలపై దాడి చేయబోమని ప్రకటించాలని, ఉత్తర కొరియా అణ్వస్త్రాల ప్రయోగాలను నిలిపి వేయాలని అమెరికా షరతులు విధించింది. అప్పడే రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభమవుతాయని పేర్కొంది. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో ట్రంప్ కిమ్ జాంగ్ తో భేటీ అయ్యేందుకు సుముఖత వ్యక్తం చేయడం మంచి పరిణామమేనంటున్నారు. అయితే రెండు దేశాలకు చెందిన అధ్యక్షులు ఇప్పుడే భేటీ అయ్యే అవకాశం కన్పించడం లేదు. అమెరికా షరతులకు కిమ్ జాంగ్ తొలుత అంగీకరించాలి. కాని వైట్ హౌస్ నుంచి ప్రకటన వచ్చిన వెంటనే ఉత్తర కొరియా స్పందించింది. అణుపరీక్షలు నిలిపేయాలన్న అమెరికా షరతును అంగీకరించేది లేదని చెప్పింది. తమ దేశం పట్ల శత్రుభావాన్ని విడనాడినప్పుడే చర్చలు ప్రారంభమవుతాయని ఉత్తర కొరియా పేర్కొంది. మొత్తం మీద నిన్నటి వరకూ సవాళ్లు విసురుకున్న రెండు దేశాలు చర్చల వైపు దృష్టి మళ్లించడం శుభపరిణామంగా చెప్పొచ్చు.

Ravi Batchali
About Ravi Batchali 19167 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*