ఎఫెన్స్ లో జగన్… డిఫెన్స్ లో బాబు….!

జగన్ సంచలన ప్రకటనతో ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ అయింది. ఈరోజు అందుబాటులో ఉన్న నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా జగన్ పార్టీ ఎంపీల రాజీనామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 6వ తేదీ లోపు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే అదేరోజు తమ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామాలు చేస్తారని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ ఎంపీల రాజీనామాల వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది. ఇప్పటి వరకూ ఏపీ విభజన హామీల అమలు కోసం చేసిన పోరాటంలో తమదే పై చేయి అని భావిస్తున్న టీడీపీకి జగన్ ప్రకటనతో అయోమయంలో పడింది.

తొలి నుంచి ప్రత్యేక హోదాపై…..

తొలినుంచి టీడీపీ ప్రత్యేక హోదాను పక్కనపెట్టింది. ప్రత్యేక ప్యాకేజీ ముద్దంటూ సాక్షాత్తూ చంద్రబాబు ప్రకటించారు. అయితే గత పది రోజుల నుంచి విభజన హామీల అమలుకోసం పార్లమెంటు లోపల, బయట ఆందోళనలు చేశారు. పార్లమెంటులో నినాదాలు చేశారు. బయట నిరసనలు తెలిపారు. దీంతో తామే ముందు వరుసలో ఉన్నామని తెలుగు తమ్ముళ్లు సంబరపడిపోయారు. జగన్ ఈ పోరాటంలో పూర్తిగా వెనకబడిపోయారని కూడా వెటకారాలు చేశారు. అయితే తాజాగా జగన్ ప్రకటనతో టీడీపీ డిఫెన్స్ లో పడిపోయింది.

ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వదని తెలిసి…..

ఎందుకంటే ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వదని తేల్చి చెప్పింది. ప్రత్యేక హోదా మాత్రం ఏపీ ప్రజలకు సెంటిమెంట్ గా మారింది. ప్యాకేజీతో రాష్ట్రం అభివృద్ధి పథాన పయనిస్తుందని చంద్రబాబు అనేక సమావేశాల్లో పదే పదే చెప్పారు. ఇప్పుడు వైసీపీ ప్రత్యేక హోదా నినాదాన్ని వైసీపీ క్యాచ్ చేసింది. తన పార్టీ ఎంపీల రాజీనామాలకు సిద్ధపడింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు చంద్రబాబు అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం కానున్నారు.

డైలామాలో టీడీపీ……

ఇప్పటికే టీడీపీ కూడా మార్చి 5వ తేదీ వరకూ కేంద్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. అయితే విభజన హామీలను అమలు చేయాలన్నదే వారి డిమాండ్. మార్చి 5 నుంచి పార్లమెంటులో పోరాటం చేయాలని కూడా టీడీపీ నిర్ణయించుకుంది. అయితే జగన్ అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు టీడీపీ డైలమాలో పడింది. విభజన హామీల అమలు కన్నా ప్రత్యేక హోదావైపే ఏపీ ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతుండటంతో టీడీపీ ఏం చేయాలో తేల్చుకోలేకపోతోంది. మొత్తం మీద టీడీపీ జగన్ ప్రకటనతో కొంత ఆలోచనలో పడినట్లే కన్పిస్తోంది.

Ravi Batchali
About Ravi Batchali 25610 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*