ఎమ్మెల్యేలు గోడ దూకేస్తున్నారోచ్…

ఎమ్మెల్యేలు గోడ దూకేస్తున్నారు. పన్నీర్ కు అవకాశాలు మెరుగుపడుతున్నాయి. గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి నిన్న రాత్తి నలుగురు ఎమ్మెల్యేలు చిన్నమ్మ దాచి ఉంచిన చోటు నుంచి జంప్ చేసి వెళ్లిపోయారు. ఈరోజు ఉదయాన్నె మరో ఎమ్మెల్యే వెళ్లిపోయారు. వీరంతా పన్నీర్ కు మద్దతు తెలుపుతారని భావిస్తున్నారు. నిన్న రాత్రి శశికళ గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి పోయెస్ గార్డెన్ కు వెళ్లిపోయిన కొద్దిసేపటికే ఈ ఎమ్మెల్యేలు చిన్నమ్మ పద్మవ్యూహాన్ని చేధించుకుని వెళ్లిపోయారు. దీంతో పన్నీర్ వర్గంలో జోష్ నెలకొంది.

గవర్నర్ నిర్ణయం కోసం….
గవర్నర్ ఇంకా నిర్ణయం ప్రకటించకపోవడంతో తమిళనాడులో రాజకీయ అనిశ్చితిపై ఇంకా సందిగ్దత కొనసాగుతూనే ఉంది. గవర్నర్ ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. గవర్నర్ న్యాయ పరమైన సలహాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘటనను ఇందుకు ఉదహరిస్తున్నారు. 1998లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కల్యాణ్ సింగ్, జగదాంబికాపాల్ లు ముందుకు వచ్చారు. అయితే అప్పడు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బలపరీక్షను నిర్వహించారు. ఇప్పడు తమిళనాడులో కూడా సేమ్ సీన్ రిపీట్ కావడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే గవర్నర్ నడుచుకోనున్నట్లు తెలుస్తోంది. న్యాయనిపుణులు కూడా వారంరోజుల్లో బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ కు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో బలపరీక్షకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈలోపు పన్నీర్ వర్గంలోకి ఎంతమంది వస్తారన్నది తేలాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*