
ఏపీ ప్రభుత్వం ముందు జనసేన అధినేత మరో డిమాండ్ ఉంచారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలోని మూలలంక రైతుల కన్నీరు ఏపీకి క్షేమం కాదని హితవు పలికారు పవన్ కల్యాణ్. దాదాపు 207 ఎకరాల మాగాణి భూములను డంపింగ్ యార్డుగా మార్చటమేనని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన కంపెనీ పోలవరం ప్రాజెక్టులో సేకరించిన మట్టినంతా మాగాణి భూముల్లో వేస్తే ప్రజలు ఎలా ఆలోచిస్తారన్న వివేకం కూడా ప్రభుత్వానికి లేకపోతే ఎలా అని అన్నారు.
మాగాణి భూములను డంపింగ్ యార్డుగా మారుస్తున్నందుకు రైతులు నిరసన వ్యక్తం చేస్తే వారిపై కేసులు పెట్టి లోపల వేయడం ఎంతవరకూసమంజసమన్నారు పవన్. పోలవరం పై నెలకొకసారి సమీక్షలు చేసే ప్రభుత్వానికి ఈ సమస్య ఎందుకు పట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. నష్టపరిహారం విషయంలోనూ వారిపై వివక్షత చూపుతున్నారని, గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం నదీపరివాహక ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని తెలియదా అని అన్నారు. అసలు గ్రీన్ ట్రిబ్యునల్ అనమతులను బయటపెట్టాలని పవన్ డిమాండ్ చేశారు.
Leave a Reply