ఐఏఎస్‌లకు బాబు ట్రైనింగ్‌

విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్‌ సాధించిన విజయాలపై ప్రసంగించేందుకు చంద్రబాబు నాయుడు ముస్సోరి వెళుతున్నారు. సోమవారం ఉత్తరాఖండ్‌లోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మిినిస్ట్రేషన్‌లో జరిగే సదస్సులో చంద్రబాబు నాయుడు ముఖ్యవక్తగా పాల్గొననున్నారు. ” నెక్స్ట్‌ లెవల్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ” పై చంద్రబాబు ప్రసంగిస్తారు. దాంతో పాటు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సాధించిన అద్భుత విజయాలను ఐఏఎస్‌లకు వివరిస్తారు. సీనియర్‌ ఐఏఎస్‌లకు నిర్వహించే తప్పనిసరి మిడ్‌ కెరీర్‌ ట్రైనింగ్‌ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనడం రెండవ సారి. మూడు వారాల పాటు జరిగే ఫేజ్ 5 శిక్షణలో చంద్రబాబు తొలిరోజు ప్రసంగించనున్నారు.

తన అనుభవాలను వివరించి…….

అన్ని రాష్ట్రాలు., కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 28ఏళ్లకు పైగా సర్వీస్‌లో ఉన్న 130మంది ఐఏఎస్‌ అధికారులు ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. చంద్రబాబు నాయుడు రియల్‌ టైం గవర్నెన్స్‌పై తన అనుభవాలను అధికారులకు వివరించే అవకాశం ఉంది. ఏపీ-తెలంగాణలుగా విభజన జరిగిన తర్వాత ఎదుర్కొన్న సవాళ్లను కూడా బాబు అధికారులకు వివరిస్తారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందచేయడంలో అమలు చేస్తోన్న సంస్కరణలు., పాలనను సులభతరం చేస్తోన్న వైనాన్ని ఆయన సోదాహరణంగా వివరిస్తారు. 2015లో కూడా చంద్రబాబు ఈ తరహా శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. అభివృద్ధిలో తొలి త్రైమాసికంలో దేశ సగటు 5.6శాతం ఉంటే ఏపీలో మాత్రం 11.72శాతం నమోదు చేసుకుంది. ఈ విజయాలు ఎలా సాధించారనే దానిపై చంద్రబాబు అధికారులకు వివరిస్తారు.

Ravi Batchali
About Ravi Batchali 40483 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*