
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. అమెరికాలో ఒబామా కేర్ హెల్త్ పథకాన్ని ట్రంప్ సర్కారు రద్దు చేసింది. నూతన హెల్త్ పాలసీకి అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. కొత్తగా ట్రంప్ సర్కార్ ప్రవేశ పెట్టిన అమెరికన్ హెల్త్ కేర్ చట్టానికి 217, 213 ఓట్ల తేడాదో ప్రతినిధుల సభ ఆమోదం తెలిపినట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ట్రంప్ సర్కారు కొత్తగా రూపొందించిన ఈ బిల్లును సహజంగానే డెమొక్రాట్లంతా వ్యతిరేకించారు. రిపబ్లికన్లు మాత్రం మద్దతు తెలపడంతో ప్రతినిధుల సభలో బిల్లు ఆమోదం పొందింది. అయితే రిపబ్లికన్లలో కూడా కొందరు ఈ బిల్లును వ్యతిరేకించారని చెబుతున్నారు. దాదాపు 20 మంది రిపబికన్లు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసినట్లు తెలుస్తోంది. అమెరికన్ ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన కొత్త హెల్త్ కేర్ చట్టానికి సెనేట్ ఆమోదించాల్సి ఉంటుంది.
కొత్త పాలసీకి ఆమోదం….
ఒబామా కేర్ ను రద్దు చేయాలన్నది ట్రంప్ తొలి లక్ష్యం. ఆయన అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తొలిరోజే ఒబామా కేర్ ను రద్దు చేస్తూ ఫైలుపై సంతకం చేశారు. ఒబామా కేర్ వల్ల కొన్ని శాఖలపై ఆర్థిక భారం పడుతుందని ట్రంప్ చెబుతున్నారు. ఆర్థిక భారాన్ని తగ్గించడానికే ఒబామా హెల్త్ కేర్ పాలసీని రద్దు చేస్తానని అని మొదట్నించి చెబుతూ వస్తున్నారు. అమెరికాలో ఒబామా కేర్ ఎఫర్ట్ బుల్ కేర్ యాక్ట్ పేర్కొంటారు. అమెరికన్లకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకే కొత్త పాలసీని తీసుకువస్తానని ఆయన చెబుతూ వస్తున్నారు. ఆ ప్రకారమే కొత్త పాలసీకి ప్రతినిధుల సభ ఆమోదం లభించింది.
Leave a Reply